వరల్డ్ వైడ్ గా సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం `ఆర్ ఆర్ ఆర్`. `బాహుబలి` వంటి సంచలన చిత్రం తరువాత పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్‌ని సొంతం చేసుకున్నరాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావడం.. అంతే కాకుండా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించిన తొలి భారీ మల్టీస్టారర్ కావడంతో ఈ చిత్రంపై సహజంగానే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ ఆడియన్స్ ఫోకస్ ని మొత్తం తన వైపుకి తిప్పేసుకుంది.
సంక్రాంతి పోటీలో ఎన్ని చిత్రాలున్నా .. `ఆర్ ఆర్ ఆర్` కున్న క్రేజే వేరు. సౌత్ లో అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తుంటే నార్త్ లో మాత్రం ఏ క్లాస్ ఆడియన్స్ మొత్తం `ఆర్ ఆర్ ఆర్` కోసం క్రేజీగా ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో థియేటర్లలో సందడికి సిద్ధమైన బన్నీ `పుష్ప`, ప్రభాస్ `రాధేశ్యామ్`చిత్రాల కోసం మాత్రం నార్త్ లో కేవలం క్లాస్ బి ఆడియన్స్ మాత్రమే ఎదురుచూస్తుండటం గమనార్హం.
ఇదిలా వుంటే నార్త్ లో మెజారిటీ షేర్ మల్టీప్లెక్స్ థియేటర్ల నుంచే రావాలి కాబట్టి ఈ మూడు పాన్ ఇండియా సినిమాల్లో `ఆర్ ఆర్ ఆర్` దే అగ్ర స్థానం అని తెలుస్తోంది. పుష్ప, రాధేశ్యామ్ లతో పోలిస్తే రాజమౌళి ఫ్యాక్టర్, పైగా దేశ భక్తి ప్రధానంగా సాగే మాసీవ్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా `ఆర్ ఆర్ ఆర్` రూపొందడం.. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ అనూహ్యంగా దేశ వ్యాప్తంగా మంచి బజ్ ని క్రియేట్ చేయడం తో ఈ రేసులో `ఆర్ ఆర్ ఆర్` దే పై చేయిగా వుండే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని.. క్రేజ్ ని గ్రాబ్ చేయడలో `ఆర్ ఆర్ ఆర్` దే అగ్ర స్థానమని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.