దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'ఆర్.ఆర్.ఆర్' మూవీ ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఓటీటీలో స్ట్రీమింగ్ అయినప్పటి నుండి అంతర్జాతీయ ప్రశంసలు అందుకుంటోంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో ఫిక్షనల్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా గా RRR చిత్రాన్ని రూపొందించారు. బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లను రాబట్టిన ఈ మల్టీస్టారర్.. ఓటీటీ రిలీజ్ తర్వాత గ్లోబల్ రీచ్ సాధించింది.
'ఆర్.ఆర్.ఆర్' మూవీ నాలుగు దక్షిణాది భాషల్లో జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే.. హిందీ వెర్షన్ మాత్రం నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో విడుదల చేయబడింది. ఓటీటీలోనూ విశేష స్పందన తెచ్చుకుని వెస్ట్రన్ కంట్రీస్ లో సంచలనం సృష్టించింది.
పాపులర్ హాలీవుడ్ ఫిలిం మేకర్స్ మరియు విమర్శకులు RRR సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దీన్నొక విజువల్ వండర్ గా అభివర్ణిస్తూ.. జక్కన్న పనితనాన్ని మరియు ప్రధాన నటీనటుల పెర్ఫార్మన్స్ ను మెచ్చుకుంటున్నారు. తమ అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.
ఈ నేపథ్యంలోనే ఓటీటీలో సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది. నెట్ ఫ్లిక్స్ లో వరుసగా 14 వారాలుగా ట్రెండింగ్ చార్టులో నిలిచి.. ఈ ఘనత సాధించిన నాన్ ఇంగ్లీష్ సినిమాగా అపూర్వమైన రికార్డును క్రియేట్ చేసింది.
నెట్ ఫ్లిక్స్ లో 'రెడ్ నోటీస్' మూవీ మాత్రమే వరుసగా 12 వారాల పాటు ట్రెండింగ్ లో ఉంది. ఇప్పుడు RRR వరుసగా 14 వారాలు ట్రెండ్ లో ఉండడం ద్వారా ఆ రికార్డును బ్రేక్ చేసింది. దిగ్గజ ఓటీటీలో మన తెలుగు సినిమా ఇలాంటి అరుదైన ఫీట్ అందుకోవడం విశేషం.
ఇకపోతే RRR మూవీ వచ్చే ఏడాది ఆస్కార్ బరిలో నిలిచే అవకాశం ఉందని.. పలు విభాగాల్లో అవార్డులు కూడా గెలుచుకోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే ఈ ఘనత సాధించిన తొలి తెలుగు సినిమా ఇదే అవుతుంది.
అల్లూరి సీతారామరాజు మరియు కొమురం భీమ్ వంటి ఇద్దరు నిజ జీవిత యోధుల స్పూర్తితో రాసుకున్న కల్పిత కథతో 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని తెరకెక్కించారు. రాజమౌళి తండ్రి కేవీ విజయేంద్ర ప్రసాద్ స్టోరీ అందించగా.. ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చారు.
డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో నిర్మించారు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. ఇందులో తారక్ - చరణ్ లతో పాటుగా అజయ్ దేవగన్ - అలియా భట్ - ఒలివియా మోరీస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.