మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకులుగా తెరకెక్కుతోన్న పాన్ ఇండియా సినిమా `ఆర్.ఆర్.ఆర్` ప్రారంభం నుంచి రకరకాల అవాంతరాలతో చిత్రీకరణ ఆలస్యమైన సంగతి తెలిసిందే. సెకండ్ వేవ్ వల్ల కొన్నాళ్లుగా షూటింగ్ వాయిదా పడింది. ఇటీవల తిరిగి షూట్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న యూనిట్ పాటల చిత్రీకరణకు రెడీ అవుతున్నారు.
దీనిలో భాగంగా ముందుగా ఎన్టీఆర్ పై ఉక్రెయిన్ లో పాటల చిత్రీకరణకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే జక్కన్న ఉక్రెయిన్ లో తిష్ట వేసి అందమైన లోకేషన్ల వేటలో ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా యూనిట్ నుంచి సినిమాకి సంబంధించి మరికొన్ని ఆసక్తికర సంగతులు బయటకు వచ్చాయి.
తారక్ తో పాటు...రామ్ చరణ్ పై కూడా అదే లోకేషన్ లో పాటల చిత్రీకరణ ప్లాన్ చేసినట్ల తెలుస్తోంది. రష్యా- ఉక్రెయిన్- రొమానియా- బ్లాక్ సీ ఏరియాల్లో రామ్ చరణ్- అలియా భట్ పై ఓ పాట చిత్రీకరించనున్నారుట. అలాగే హైదరాబాద్ లో మరో పాట ఇదే జంటపై షూట్ చేయనున్నట్లు సమాచారం. కేవలం రెండు పాటలు మినిహా టాకీ పార్ట్ కూడా పూర్తయినట్లు యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. మరి ఆర్.ఆర్.ఆర్ లో మొత్తం ఎన్ని పాటలున్నాయన్నది యూనిట్ క్లారిటీ ఇస్తే గాని తెలియదు.
సాధారణంగా రాజమౌళి కమర్షియాల్టీ కోసం పాటలు సమపాళ్లలోనే పెడతారన్నది నిపుణుల మాట. ఆ లెక్క ప్రకారమే బాహుబలి రెండు భాగాల్లోనూ పాటలున్నాయి. అయితే రాజమౌళి క్రియేటివి యాంగిల్ లో ఎన్ని పాటలున్నా కంటెంట్ పక్క దొవ పట్టదు..ఆడియన్స్ డైవర్ట్ కావడానికి ఛాన్సివ్వరనేది అంతే వాస్తవం. ఈసారి ఏకంగా ఇద్దరు స్టార్ హీరోల్ని ఒకే వేదికపై తీసుకొచ్చి పాన్ ఇండియా సినిమాగా ప్రకటించి మరీ సాహసం చేశారు. కాబట్టి ఆర్.ఆర్.ఆర్ లో ప్రతీ పాట హైలైట్ గానే ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక శంకర్ తరహాలో విజువల్ గ్రాండియారిటీతో జక్కన్న పాటల్ని మలిచే ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తోంది.