వంద కోట్లు దాటిన ఐటీ కలెక్షన్లు

Update: 2019-01-07 08:35 GMT
నిన్న - మొన్నటి వరకు సినిమా వసూళ్లు 50కోట్లు రావడమే గగమనయ్యే పరిస్థితి నుంచి ప్రస్తుత సినిమాలు వంద కోట్లు ఈజీగా దాటేస్తున్నాయి. ఒకప్పుడు ఐటీ శాఖ నిర్వహించే దాడుల్లో చిన్న చితక డబ్బులు పట్టుబడేవీ కాగా ప్రస్తుతం వంద కోట్లు పట్టుబడుతున్నాయి.

ఇటీవల కన్నడ సూపర్ స్టార్లపై ఐటీ నిర్వహించిన దాడుల్లో కళ్లు తిరిగే వసూళ్లు బయటపడ్డట్లు తెలుస్తోంది.ఐటీ అధికారులు పక్కా ప్రణాళికతో మూడు రోజులపాటు 180మంది అధికారులు ముప్పైకిపైగా స్థానాల్లో సోదాలు నిర్వహించగా బ్లాక్ బస్టర్ కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ దాడుల్లో రూ.109కోట్ల రూపాయల నగదు. 25కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు ఐటీ అధికారులు అధికారికంగా ప్రకటించారు.

కేజీఎఫ్ హీరో యశ్ దగ్గర నుంచి కిచ్చా సుదీప్ - సూపర్ స్టార్ రాజ్ కుమార్ ఇద్దరు కుమారులు - నిర్మాత రాక్ లైన్ వెంకటేశ్ లాంటి స్టార్లపై దాడులు నిర్వహించిన ఐటీ ఎవరూ ఊహించలేనంత డబ్బు పట్టుకుంది. సోదాల విషయం తెలుసుకున్న నటులు షూటింగ్ లను వదిలేసి ఇంటికి చేరుకుని అధికారులకు అందుబాటులో ఉన్నారు. సోదాల అనంతరం తాము ఏ తప్పు చేయలేదని ప్రకటించారు. కాగా సినిమాలకు సంబంధించిన ఆడియో రైట్స్ - ఇంటర్నెట్ రైట్స్ - కలెక్షన్ వంటి లావాదేవీల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఐటీ అధికారులు చెబుతున్నారు.

శాండిల్ వుడ్ నటులపై ఐటీ అధికారుల సమాచారంతో సినీవర్గాలు కలవరపాటుకు గురయ్యాయి. దీంతో టాలీవుడ్ - మల్లువుడ్ పరిశ్రమలోని బడా బాబులు అలర్టవుతున్నారు. ఇప్పుడిప్పుడే భారీ కలెక్షన్లు సాధిస్తున్న శాండిల్ వుడ్ లోనే వందకుపైగా కోట్లు పట్టుబడితే టాలీవుడ్ - మల్లువుడ్ - బాలీవుడ్ లో ఐటీ దాడులు చేస్తే ఎంత మొత్తంలో పట్టుబడుతుందోనని పలువురు లెక్కలేస్తున్నారు. ఈ దిశగా ఐటీ అధికారులు కూడా ఆలోచించే ఉంటారు. భవిష్యత్ లో ఏం జరుగవచ్చని సినీ వర్గాలు మథనపడుతున్నాయి.


Full View

Tags:    

Similar News