అద్భుతమైన దృశ్యరూపకంగా నిలిచి చలనచిత్ర రంగంలో రికార్డులు సృష్టిస్తున్న బాహుబలి -2 సినిమా మరో ప్రత్యేకతను సంతరించుకుంది. ఫ్యూచర్ జనరలీ ఇన్సూరెన్స్ కంపెనీనుంచి రూ.200 కోట్ల రూపాయలకు బీమా పాలసీ తీసుకుంది. ఫ్యూచర్ జనరలి ఇన్సూరెన్స్ కంపెనీ ఒక ప్రకటనలో ఈ విషయం తెలియజేసింది. ఫిలిమ్ ప్యాకేజి ఇన్సూరెన్స్ ప్యాకేజి కింద ఈ బీమా చేసినట్లు ఆ కంపెనీ తెలియజేసింది. నిర్మాణం దశలో, అలాగే పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఎదురయ్యే రిస్క్ లకు ఈ పాలసీ వర్తిస్తుందని ఆ సంస్థ తెలిపింది. షూటింగ్ సమయంలో ఏ నటుడికైనా అనారోగ్యం కలిగినా, లేదా ఎవరైనా మృతి చెందినా, లేదా ప్రకృతి వైపరీత్యాల కారణంగా సినిమా షెడ్యూల్‌లో ఆలస్యం జరిగినా ఈ పాలసీ కింద బీమా వర్తిస్తుందని ఆ సంస్థ ఆ ప్రకటనలో తెలిపింది.
ఇటీవలి కాలంలో సినీ రంగంలో బీమా కవరేజి తీసుకోవడం రానురాను పెరుగుతోందని ఫ్యూచర్ జనరలీ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ కేజీ కృష్ణమూర్తి రావు తెలిపారు. తమ సంస్థ 2017 ఆర్థిక సంవత్సరంలో బాలీవుడ్ సినిమాలు సహా 160 సినిమాలకు బీమా పాలసీలు జారీ చేసిందని ఆయన చెప్పారు. ఇప్పుడు తాము దక్షిణాది సినీ పరిశ్రమపై ఎక్కువగా దృష్టి పెట్టినట్లు ఆయన చెప్పారు. ఇప్పటివరకు తాము 372 సినిమాలను బీమా చేసినట్లు కూడా ఆయన తెలిపారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/