'Rx 100' హీరోతో 'చిలసౌ' బ్యూటీ రొమాన్స్..?

Update: 2021-07-15 09:43 GMT
Rx 100 హీరోతో చిలసౌ బ్యూటీ రొమాన్స్..?
  • whatsapp icon
యువ కథానాయకుడు కార్తికేయ గుమ్మకొండ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోడానికి ప్రయత్నం చేస్తున్నాడు. 'Rx 100' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కార్తికేయ.. ఇటీవల 'చావు కబురు చల్లగా' చిత్రంతో నిరాశపరిచాడు. ప్రస్తుతం 'రాజా విక్రమార్క' చిత్రంలో నటిస్తున్న కార్తికేయ.. ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ లో ఓ సినిమా చేయనున్నాడని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది.

యూవీ క్రియేషన్స్ వారు పాన్ ఇండియా సినిమాలతో పాటుగా మీడియం బడ్జెట్ చిత్రాలు రూపొందిస్తున్నారు. అలానే 'యూవీ కాన్సెప్ట్స్' అనే అనుబంధ సంస్థను ఏర్పాటు చిన్న బడ్జెట్ సినిమాలపై దృష్టి పెట్టారు. ఇటీవల 'ఏక్ మినీ కథ' అనే మినీ చిత్రాన్ని నిర్మించి సక్సెస్ అయ్యారు.

ఈ క్రమంలో కార్తికేయ గుమ్మకొండతో ఓ సినిమా చేయాలని చూస్తున్నారట. ఇదొక రొమాంటిక్ ఎంటర్టైనర్ అని.. దీంతో ప్రశాంత్‌ అనే కొత్త దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఇందులో కార్తికేయ సరసన రుహానీ శర్మ హీరోయిన్ గా నటిస్తోందని అంటున్నారు.

'చి ల సౌ' చిత్రంతో టాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగుపెట్టిన రుహానీ శర్మ.. 'హిట్' 'డర్టీ హరి' వంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం దిల్ రాజు - క్రిష్ జాగర్లమూడి కలిసి నిర్మిస్తున్న '101 జిల్లాల అందగాడు' చిత్రంలో అవసరాల శ్రీనివాస్ కి జోడిగా నటిస్తోంది. ఈ క్రమంలో రుహాని ఇప్పుడు యూవీ సంస్థ నిర్మించే చిత్రంలో కార్తికేయ తో రొమాన్స్ చేయనుందని తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే పెద్ద ప్రొడక్షన్ లో వచ్చే ఈ సినిమా హీరో హీరోయిన్లు ఇద్దరి కెరీర్ కు ప్లస్ అవుతుందని చెప్పవచ్చు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి.

ఇకపోతే కార్తీకేయ ప్రస్తుతం శ్రీ సరిపల్లి దర్శకత్వంలో 'రాజా విక్రమార్క' అనే యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నాడు. ఇందులో కార్తికేయ ఎన్ఐఏ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. తాన్యా రవిచంద్రన్ ఈ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. టి.ఆదిరెడ్డి సమర్పణలో 88 రామారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదే క్రమంలో సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లో కార్తికేయ ఓ సినిమా చేయనున్నాడు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రానికి కథ - స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందిస్తుండటం విశేషం.

కార్తికేయ హీరోగా మాత్రమే సినిమాలు చేయాలని ఫిక్స్ అవకుండా.. తనలోని నటుడిని బయటకు తీయడానికి అవకాశం వచ్చినప్పుడు విలన్ పాత్రల్లోనూ నటిస్తున్నాడు. నాని హీరోగా నటించిన 'గ్యాంగ్ లీడర్' చిత్రంలో కార్తికేయ ప్రతినాయకుడిగా కనిపించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తమిళ స్టార్ హీరో అజిత్ నటిస్తున్న 'వాలిమై' సినిమాలో కూడా కార్తికేయ నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారక్టర్ ప్లే చేస్తున్నాడు. ఈ సినిమాతో తయువ హీరో కోలీవుడ్ లో క్రేజ్ తెచ్చుకుంటాడేమో చూడాలి.
Tags:    

Similar News