నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కెయస్ రవికుమార్ దర్శకత్వంలో 'రూలర్' సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రం డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య NBK106 చేస్తున్నారు. బాలయ్య-బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కిన రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఘన విజయం సాధించడంతో ఈ సినిమా హ్యాట్రిక్ ఫిలిం కానుంది.
రీసెంట్ గా NBK106 సినిమా బిజినెస్ గురించి గురించి కొన్ని వార్తలు వచ్చాయి. ఈ సినిమాకు అప్పుడే ప్రీ రిలీజ్ బిజినెస్ స్టార్ట్ అయిందని.. కొన్ని ఎరియాలకు ఫ్యాన్సీ రేట్లు ఇచ్చేందుకు బయ్యర్లు ముందుకొస్తున్నారని అన్నారు. అయితే ఇదేమీ అంత నమ్మశక్యంగా లేదనే వాదన వినిపిస్తోంది. నిజానికి బాలయ్య 'రూలర్' సినిమా బిజినెస్ సంగతే ఇంకా తేలలేదు. బాలయ్య నటించిన గత రెండు సినిమాల ఫలితం ఏంటనేది అందరికీ తెలిసిందే. దీంతో బాలయ్య సినిమాకు ఒక స్థాయి వరకూ పెట్టుబడి పెడతారు కానీ థియేట్రికల్ రైట్స్ కోసం పోటీ పడే పరిస్థితి అయితే లేదు.
ఇదిలా ఉంటే NBK106 ప్రొడ్యూసర్ మిర్యాల రవీంద్ర బడ్జెట్ విషయంలో బోయపాటి శ్రీనుకు ఇంకా హామీ ఇవ్వలేదట. 'రూలర్' సినిమాకు వచ్చే కలెక్షన్స్ ను బట్టి కొత్త సినిమా బడ్జెట్ ఎంత పెట్టాలనే నిర్ణయం తీసుకుంటానని చెప్పారనే టాక్ వినిపిస్తోంది. ఒకవేళ 'రూలర్' చిత్రం భారీ కలెక్షన్స్ నమోదు చేసిన పక్షంలో కొత్త సినిమా బడ్జెట్ పెంచేందుకు ఆయనకు అభ్యంతరం లేదట. బాలయ్య-బోయపాటి సినిమా బడ్జెటే ఇంకా ఫైనలైజ్ కాకుండా బిజినెస్ అప్పుడే స్టార్ట్ అయిందంటే ఆ వార్తలలో ఎంతమాత్రం నిజముందో అర్థం చేసుకోవచ్చని సినీవర్గాలవారు వ్యాఖ్యానిస్తున్నారు.