డ్రగ్స్ కేసులో అప్రూవర్‌ గా మారితే ఎంతమంది బయటకి వస్తారో...?

Update: 2020-09-05 16:00 GMT
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి కేసులో డ్రగ్స్ కోణం వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రంగంలోకి దిగి సాక్ష్యాధారాలు సేకరించారు. ముందుగా డ్రగ్స్ డీలర్ కైజన్ ఇబ్రహీంను అదుపులోకి తీసుకున్న ఎన్సీబీ అధికారులు.. అతను ఇచ్చిన సమాచారంతో రియా చక్రవర్తి సోదరుడు షోవిక్ మరియు సుశాంత్ ఇంటి మేనేజర్‌ శామ్యూల్ ల ఇళ్లపై దాడులు నిర్వహించింది. ఈ క్రమంలో డ్రగ్స్ అమ్మకాల్లో పాల్గొన్నందుకు ఇరువురిని అరెస్ట్ చేసి మాదక ద్రవ్యాల నిరోధక చట్టంలోని అనేక సెక్షన్ల కింద వారిపై కేసు నమోదు చేసారని తెలుస్తోంది. నేడు షోవిక్ మరియు శామ్యూల్ లను కోర్టులో హాజరపరిచారు.

కాగా, జాతీయ మీడియా వర్గాల సమాచారం ప్రకారం రియా తనను డ్రగ్స్ తీసుకుని రమ్మని కోరిందని.. వాటిని తాను సుశాంత్ కు అందించానని రియా సోదరుడు షోవిక్ అధికారుల వద్ద అంగీకరించాడని తెలుస్తోంది. అంతేకాకుండా షోవిక్ చక్రవర్తి అప్రూవర్‌ గా మార్చవచ్చనే పుకార్లు వస్తున్నాయి. ఇదే కనుక జరిగితే బాలీవుడ్ లోకి చాలామంది పేర్లు డ్రగ్స్ కేసులో తెరపైకి వచ్చే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఇప్పటికే డ్రగ్స్ మాఫియాలో బాలీవుడ్ ప్రముఖులకు సంబంధాలు ఉన్నాయని వార్తలు వస్తున్న తరుణంలో షోవిక్ అప్రూవర్ గా మారితే కేసులో మరిన్ని విషయాలు బయటకు వస్తాయి. మరోవైపు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు రేపు హాజరుకావాలని రియా చక్రవర్తికి సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే డ్రగ్స్ వ్యవహారంలో రియా చక్రవర్తిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి.




Tags:    

Similar News