యువహీరో శ్రీ విష్ణు నటించిన `రాజ రాజ చోర` విమర్శకుల ప్రశంసలతో పాటు థియేటర్లలో ఆడియెన్ నుంచి పాజిటివ్ టాక్ ని అందుకుంటోంది. ఇటీవల వచ్చిన సినిమాల్లో ఏకగ్రీవ సానుకూల సమీక్షలను పొందిన చిత్రంగా రికార్డులకెక్కింది. అప్పట్లో ఒకడుండేవాడు.. బ్రోచేవారెవరురా లాంటి విలక్షణ చిత్రాలతో ఆకట్టుకున్న శ్రీవిష్ణు మరోసారి వైవిధ్యమైన కంటెంట్ తో ఎమోషనల్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నారన్న టాక్ వినిపిస్తోంది.
ఈ వారాంతం సెలవుల్లో రాజ రాజ చోర ప్రేక్షకులకు బెస్ట్ ఎంపిక అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. పాజిటివ్ టాక్ రావడం.. మొహర్రం సెలవుదినం కలిసి రావడం కూడా ఈ సినిమాకు అద్భుతంగా కలిసొస్తోంది. వారాంతపు రిజల్ట్ బాక్సాఫీస్ వద్ద బెస్ట్ గా వర్కవుటవుతుందని భావిస్తున్నారు.
ఈ చిత్రం మాస్ మహారాజా రవితేజను కూడా ఆకట్టుకుంది. ``రాజరాజచోరా చూసాను! వినోదాత్మక .. భావోద్వేగ చిత్రం. పూర్తి సినిమాని ఆస్వాధించాను. టీమ్ మంచి వర్క్ చేసారు. శ్రీవిష్ణు నటన.. డైరెక్టర్ హసిత్ గోలి విజన్ ఆకట్టుకున్నాయి. మొత్తం బృందానికి అభినందనలు! పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ- ఏఏ ఆర్ట్స్ కి శుభాకాంక్షలు`` అని రవితేజ ప్రశంసలు కురిపించారు. రాజ రాజ చోర చిత్రంలో ప్రథమార్థం అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్న శ్రీవిష్ణు ద్వితీయార్థంలో గొప్ప ఎమోషనల్ పెర్ఫామెన్సెస్ తో మెప్పించారు. ఈ సినిమాలో కథానాయికగా నటించిన టెంథ్ క్లాస్ బ్యూటీ నటనకు మంచి గుర్తింపు దక్కింది. చూస్తుంటే మాస్ మహారాజా రాజరాజ చోర దర్శకుడు హసిత్ గోళీకి అవకాశం ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. మంచి స్క్రిప్టుతో రవితేజను ఒప్పించగలిగితే అవకాశం పెద్ద కష్టమేమీ కాదు.