జూనియర్ ఎన్టీఆర్-రామ్ చరణ్ ల క్రేజీ కాంబినేషన్లో రాజమౌళి మెగా మల్టీస్టారర్ కు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా గురించి అధికారిక సమాచారం కూడా బయటికి వచ్చింది. రాజమౌళి.. రామ్ చరణ్.. రామారావు (జూనియర్ ఎన్టీఆర్)ల తొలి అక్షరాల్నే తీసుకుని దీనికి ‘ఆర్ఆర్ఆర్’ అనే సంక్షిప్త నామం పెట్టి ఆ హ్యాష్ ట్యాగ్ మీదే సినిమాను కూడా అనౌన్స్ చేశారు. ఐతే ఇందులో మరిన్ని ‘ఆర్’లు చేరబోతున్నట్లుగా ప్రచారాలు నడుస్తున్నాయి. ఈ చిత్రానికి కథానాయికగా రాశి ఖన్నా.. రకుల్ ప్రీత్ పేర్లు ఇప్పటికే వినిపించాయి. ఇప్పుడు ‘ఛలో’ భామ రష్మిక మందాన్నా పేరూ తెరమీదికి వచ్చింది.
ఇక ఈ చిత్రానికి విలన్ అంటూ రాజశేఖర్ పేరు కూడా ప్రచారంలోకి రావడం విశేషం. ‘గరుడవేగ’తో ఘనంగా రీఎంట్రీ ఇచ్చిన రాజశేఖర్.. ఆ తర్వాత హీరోగా మరో సినిమా ఏదీ మొదలుపెట్టలేదు. తాను విలన్.. క్యారెక్టర్ రోల్స్ చేయడానికి రెడీ అంటూ ఆయన ఇంతకుముందే ప్రకటించారు. ఐతే ఆ విషయంలో ఏ ప్రాజెక్టు ఒప్పుకున్నా ప్రతిష్టాత్మకంగా ఉండాలని భావిస్తున్న రాజశేఖర్.. ఎన్టీఆర్-చరణ్ సినిమా కోసం అడగ్గానే ఒప్పేసుకున్నాడంటూ రూమర్లు హల్ చల్ చేస్తున్నాయి. మొన్న రాజశేఖర్ కూతురు శివాని కథానాయికగా పరిచయవుతన్న సినిమా ‘2 స్టేట్స్’ ఓపెనింగ్ కి రాజమౌళి ముఖ్య అతిథిగా వచ్చాడు. ఆ సందర్భంగా రాజశేఖర్ తో రాజమౌళి ముచ్చటిస్తూ కనిపించాడు. ఇక్కడి నుంచే ఈ ఊహాగానాలకు తెరలేచింది. పైగా ఇక్కడ ‘ఆర్’ సెంటిమెంటు కూడా కలిసొచ్చేసింది. దీంతో ప్రచారం ఊపందుకుంది. ఐతే కేవలం ఊహాగానమేనా.. నిజంగా ఇందులో నిజముందా అన్నది చూడాలి.