సాహో యుఎస్ ఆశలు గల్లంతు!

Update: 2019-09-08 08:31 GMT
బాహుబలి 2ని టార్గెట్ చేస్తూ ముందు నుంచి విపరీతమైన హైప్ తో వచ్చిన సాహో ఎట్టకేలకు ఊహించని విధంగా చాలా త్వరగా ఫైనల్ రన్ వైపుకు పరిగెడుతోంది. కనీసం నెల రోజులు మంచి రన్ ఉంటుందని ఆశించిన ట్రేడ్ ఇప్పుడీ ఫలితంతో బాగా నిరాశలో ఉంది. ఓవర్సీస్ లోనూ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమి లేదు. చెప్పుకోవడానికి నిన్నటితో 3 మిలియన్ మార్క్ చేరుకున్న సాహో కాస్త అటు ఇటుగా భరత్ అనే నేను దగ్గరకు వెళ్లేలా ఉంది తప్ప ఫుల్ రన్ లో కనీసం బాహుబలి 1(6.9 మిలియన్లు)ని క్రాస్ చేయడం కూడా అసాధ్యమని తేలిపోయింది.

ఇంకో అర మిలియన్ వస్తే రంగస్థలంని దాటే అవకాశం ఉంది కానీ ఇప్పటికే విపరీతంగా ఉన్న టికెట్ డ్రాప్ ని బట్టి చూస్తే అదీ అంత ఈజీ కాదని బయ్యర్లు ఫిక్స్ అయిపోయారు. ఈ లెక్కన కమర్షియల్ కోణంలో చూస్తే సాహోకు యుఎస్ లో పెద్ద షాకే తగిలింది. 12 మిలియన్ల డాలర్లతో ఎవరికి అందనంత ఎత్తులో ఉన్న బాహుబలి 2ని టార్గెట్ చేయడం ఎంత ఖరీదైన పొరపాటో అక్కడి బయ్యర్లకు తెలిసి వస్తోంది.

ఒకవేళ సాహో భరత్ అనే నేనునో రంగస్థలంనో క్రాస్ చేసినా గర్వంగా చెప్పుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే అవి రెగ్యులర్ బడ్జెట్ లో రూపొందిన కమర్షియల్ సినిమాలు. ఇంత ఓవర్ హైప్ తో బిల్డప్ ఇచ్చుకోలేదు. సాహోని ఓ రేంజ్ లో ప్రమోట్ చేశారు కాబట్టి ఇప్పుడీ అవమానాలు తప్పడం లేదు. ఏదేమైనా సాహో యుఎస్ గాలిమేడలు నిట్టనిలువునా కూలిపోయాయి. ఇప్పుడీ వారంలో వచ్చేది ఎంత అనేదాన్ని బట్టే ఫైనల్ ఫిగర్స్ ఫిక్స్ అవుతాయి


Tags:    

Similar News