సాహో: తెలుగు రాష్ట్రాల్లో మొదటివారం కలెక్షన్స్

Update: 2019-09-06 06:12 GMT
ప్రభాస్ నటించిన హై బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ 'సాహో' వారం రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది.  భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ మొదటి వీకెండ్ లో భారీ కలెక్షన్స్ నమోదు చేసింది. వీకెండ్ కు కొనసాగింపుగా వినాయక చవితి హాలిడే కూడా తోడవడంతో సినిమాకు అది కొంత ప్లస్ గా మారింది. అయితే ఐదవ రోజుకు మాత్రం సినిమా కలెక్షన్స్ భారీగా డ్రాప్ అయ్యాయి.

హిందీలో ఈ చిత్రం దాదాపు రూ. 120 కోట్ల నెట్ వసూళ్ళతో హిట్ అనిపించుకుంది.  కానీ మిగతా వెర్షన్స్ మాత్రం డిజాస్టర్ దిశగా పయనిస్తున్నాయి. తమిళ వెర్షన్ మొదటి నుంచి రెస్పాన్స్ తక్కువే ఉంది.. ఇప్పటికే డిజాస్టర్ అని ట్రేడ్ పండితులు తేల్చారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా 'సాహో' డిజాస్టర్ దిశగా పయనిస్తోంది.   మొదటి వారంలో సాహో రూ.70 కోట్ల షేర్  వసూలు చేసింది.  అయితే బ్రేక్ ఈవెన్ అనిపించుకోవాలంటే సినిమా మరో యాభై కోట్లు కలెక్ట్ చేయాలి.  ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే అది చాలా కష్టం.

రెండు తెలుగు రాష్ట్రాల్లో సాహో మొదటి వారం కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.

నైజామ్:  26.24 cr
ఉత్తరాంధ్ర:  8.94 cr
సీడెడ్: 10.79 cr
కృష్ణ:  4.69 cr
గుంటూరు:  7.44 cr
ఈస్ట్ గోదావరి: 6.92 cr
వెస్ట్ గోదావరి: 5.32 cr
నెల్లూరు:  3.90 cr

ఏపీ తెలంగాణా టోటల్: రూ. 74.24 cr

Disclaimer: Figures mentioned here have been collected from few sources and also include estimates. Authenticity can't be guaranteed...!


Tags:    

Similar News