సాహో' సెకండ్ రిలీజ్ కు డేట్ ఫిక్స్
ఈమద్య కాలంలో సినిమాలను ప్రేక్షకులు వెండి తెరపై ఏ స్థాయిలో చూస్తున్నారో డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ లపై అంతకు మించి చూస్తున్నారు. స్టార్ హీరోల సినిమాలు యావరేజ్ టాక్ తెచ్చుకుంటే థియేటర్లలో చూడటం కంటే ఎక్కువగా డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ లపై చూసేందుకు ఆసక్తి చూపుతున్నట్లుగా ఒక సర్వేలో వెళ్లడయ్యింది. బాలీవుడ్.. కోలీవుడ్.. టాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని భాషల సినిమాలకు ఇదే పరిస్థితి ఉంది. అందుకే డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ లకు సినిమా రైట్స్ ను భారీ మొత్తాలకు నిర్మాతలు అమ్ముతున్నారు.
సినిమా విడుదలైన కొన్ని రోజులకే అమెజాన్.. నెట్ ప్లిక్స్ వంటి డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ లపై వచ్చేస్తున్నారు. సాహో ను అమెజాన్ ప్రైమ్ అన్ని భాషలకు కలిపి రూ.42 కోట్లు వ్యచ్చించి కొనుగోలు చేసింది. థియేటర్లలో రాక ముందు ప్రేక్షకులు సాహో కోసం ఎదురు చూశారో.. ఇప్పుడు సినిమాను చూడని వారు అమెజాన్ లో ఎప్పుడు వస్తుందా అంటూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు సాహో చిత్రం విడుదలకు అమెజాన్ డేట్ ను ఖరారు చేసింది.
సాహో చిత్రం సెకండ్ రిలీజ్ ను అక్టోబర్ 19 తేదీకి ఫిక్స్ చేశారు. ఒకేసారి తెలుగుతో పాటు హిందీ.. తమిళం.. కన్నడం.. మలయాళంలో విడుదల చేయబోతున్నారు. సాహో చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 400 కోట్లు వసూళ్లు చేసింది. బాహుబలి చిత్రంతో ఆల్ ఇండియా సూపర్ స్టార్ అయిన ప్రభాస్ కు దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అన్ని భాషల్లో కూడా సాహో చిత్రం అమెజాన్ లో దుమ్ము లేపే అవకాశం ఉందని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు.