స‌చిన్ టెండూల్క‌ర్ కుమార్తె లవ్ ఎవ‌రితో!

Update: 2021-11-11 11:32 GMT
సారా టెండూల్కర్ ఎట్టకేలకు `తన జీవితంలోని ప్రేమ`ను బహిర్గతం చేసింది. తాను ప్రేమ‌లో ఉన్నాన‌ని బహిరంగంగా ఒప్పుకుంది. ఇది క్రికెట్ గాడ్ టెండూల్క‌ర్ అభిమానుల‌ను సంభ్ర‌మాశ్చ‌ర్యాల‌కు గురి చేసింది. ఇది ఎంతో కాలంగా వేచి చూస్తున్న బిగ్ న్యూస్ అని చెప్పాలి. సారా ఇలా ఈ వ్యాఖ్య‌ను చేసిందో లేదో అది సోష‌ల్ మీడియాల్లో సునామీని త‌ల‌పించింది.

సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ అత్యంత అందమైన ప్రతిభావంతురాలైన హాట్ గాళ్ గా యూత్ లో ఫేమ‌స్ అయ్యింది. ఆమె తండ్రి దేశవ్యాప్త విజయం మరియు ప్ర‌పంచ‌వ్యాప్తంగా స్టార్‌డమ్ క‌లిగిన క్రికెట‌ర్‌. దీనివ‌ల్ల సారా ఎప్పుడూ అభిమానుల‌ దృష్టిలో ఉండటం సహజం. అయితే ఇదే అంశం సారాను సోష‌ల్ మీడియా సెల‌బ్రిటీని చేసింది. నెమ్మదిగా అయినా స్థిరంగా డిజిటల్ ఐకాన్ గా తనకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరుచుకుంది.

చాలా కాలంగా సారా వ్యక్తిగత జీవితంపై ఒక ప్ర‌శ్న జ‌వాబు లేనిదిగా ఉంది. త‌న ల‌వ్ లైఫ్ గురించి పుకార్లు వ్యాపిస్తున్నా వాటిపై అధికారికంగా క్లారిటీ ఇవ్వ‌లేదు. ఆమె తన ల‌వ‌ర్ గురించి బహిరంగంగా తెలుసుకోవాల‌ని చాలా మంది భావిస్తున్నా అది క‌ల‌గానే మిగిలింది. త‌న‌కంటే ఒక ఏడాది చిన్న‌వాడైన శుభ్ మన్ గిల్ ని సారా టెండూల్క‌ర్ ప్రేమిస్తోంద‌ని ప్ర‌చారం సాగినా దానికి త‌గిన ఆధారాలు అయితే లేవు. సారా తన పుట్టినరోజు సందర్భంగా తన తల్లి పై ఉన్న ప్రేమను వ్య‌క్తం చేసింది. ఆమె తనతో ఏమి చెప్పాలని ఆలోచిస్తోంది! అంటే.. అవును నేను మామ్ ని ప్రేమిస్తున్నాను అనేదే పెద్ద ట్విస్ట్. ఇప్ప‌ట్లో సారా ల‌వ‌ర్ ఎవ‌రు? అనేది క‌నిపెట్ట‌డం అంత సులువేమీ కాదు సుమీ!

మ‌రోవైపు సారా టెండూల్క‌ర్ ని సోష‌ల్ మీడియాల్లో ప్రేమిస్తున్న వారి సంఖ్య అప‌రిమితంగా ఉంది. బాలీవుడ్ స్టార్ సారా అలీఖాన్ ని మించి అభిమానిస్తూ సారా ఫోటోల‌ను ట్రెండ్ చేస్తున్నారు. ఇక సారా త‌న హాట్ అవ‌తార్ కి సంబంధించిన ఫోటోల‌ను త‌న కుటుంబానికి సంబంధించిన ఫోటోల‌ను విరివిగా షేర్ చేయ‌గా అవ‌న్నీ వైర‌ల్ గా మారుతున్నాయి.
Tags:    

Similar News