ఇప్పుడు అందరినోటా ఒకటే చర్చ. అసలు మెగా హీరోలు ఎలాంటి సినిమాలను ఓకె చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? అనేదే ఆ విషయం. ఎందుకంటే సాయిధరమ్ తేజ్ అండ్ వరుణ్ తేజ్ తీసుకున్న కొన్ని డెసిషన్లు అంత సంచలనంగా మారిపోయాయ్ మరి.
మొన్న ముహూర్తం పూజ కూడా జరగడంతో.. శ్రీను వైట్ల డైరక్షన్ లో వరుణ్ 'మిష్టర్' సినిమా మొదలైందనే అనుకున్నారు అందరూ. అయితే వరుణ్ ఎక్కువ రెమ్యూనరేషన్ అడుగుతున్నాడని.. స్పెయిన్ వీసాలు రాలేదని.. ఇలా చాలా రూమర్లే విన్నాం కాని సినిమా మాత్రం మొదలవ్వలేదు. ఇక సాయిధరమ్ కూడా 'తిక్క' సినిమాకు షూటింగ్ చేస్తున్నాడే కాని.. గోపిచంద్ మలినేని డైరక్షన్ లో సినిమాను మాత్రం మొదలెట్టట్లేదు. దానికీ ఏవేవో రీజన్లు చెప్పారు. కాని అసలు విషయం ఏంటంటే.. సింగిల్ లైన్లో చెప్పిన కథ.. పూర్తిగా డైలాగ్ వర్షన్ వచ్చేసరికి సెకండాఫ్ లో సరుకు లేదంట. ఇటు శ్రీను వైట్ల కాని అటు గోపిచంద్ మలినేని కాని క్లయ్ మ్యాక్స్ ను ఏమాత్రం ఆసక్తికరంగా తీర్చిదిద్దలేని టాక్ వినిపిస్తోంది.
ఇప్పటికే ఈ దర్శకులు ఇద్దరూ రొటీన్ మసాలా సినిమాలనే తీస్తారని ఒక స్టాంప్ పడిపోయింది. అందుకే వారిని కొత్త తరహా ఎండింగ్ తో వస్తే కాని సినిమా మొదలు పెట్టేది లేదంటూ మెగా హీరోలు కండీషన్లు పెట్టేసి.. ఇతర దర్శకులతో సినిమాలు చేసుకోవడానికి సన్నద్దమవుతున్నారు.