చిరంజీవి సూపర్ హిట్ చిత్రాల్లో గ్యాంగ్ లీడర్ ఒకటి. ఇప్పుడు వంద కోట్ల సినిమాల గురించి ఎలా మాట్లాడుకొంటున్నామో అలా అప్పట్లో గ్యాంగ్ లీడర్ సృష్టించిన బాక్సాఫీసు సంచలనాల గురించి మాట్లాడుకొన్నారు. చిరంజీవిని మాస్ కథానాయకుడిగా ఒక అగ్రపీఠంపై కూర్చోబెట్టింది కూడా ఈ చిత్రమే. ఒక ట్రెండ్ సెట్టర్ లాంటి ఆ సినిమాని రీమేక్ చేయాలనేది చిరు తనయుడు రామ్ చరణ్ ఆలోచన. ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ ఆ విషయాన్ని చెబుతుంటాడు చెర్రీ. అయితే ఇంతలో గ్యాంగ్ లీడర్ పేరుతో మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ సినిమా చేస్తున్నాడన్న కబురు బయటికొచ్చింది. రెండు మూడు రోజులుగా ఇండస్ట్రీలో ఆ విషయం గురించే చర్చ జరుగుతోంది.
సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుందన్న మాట చాలా రోజులుగా వినిపిస్తోంది. ఆ చిత్రానికే గ్యాంగ్ లీడర్ అనే పేరును ఫిక్స్ చేశారని చెప్పుకొన్నారు. అయితే ఆ విషయంపై మెగా ఫ్యాన్స్ నుంచి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. గ్యాంగ్ లీడర్ లాంటి పవర్ఫుల్ టైటిల్ ని సాయిధరమ్ తేజ్ వాడటం కంటే పవన్ కళ్యాణ్ కానీ, లేదంటే చరణ్ కానీ వాడితేనే బెటర్ అనేది అభిమాన సంఘాల వాదన. అదే విషయాన్నే సాయిధరమ్ తేజ్ కూడా చెప్పాడట. దీంతో చిత్రబృందం కూడా ఆ టైటిల్ కాకుండా వేరొక టైటిల్ గురించి ఆలోచించే పనిలో పడిపోయిందట. సాయిధరమ్ తేజ్ కూడా స్వయంగా రంగంలోకి దిగి నేను గ్యాంగ్ లీడర్ పేరుతో సినిమా చేయడం లేదని అభిమానులతో చెప్పాడట. దీంతో గ్యాంగ్ లీడర్ ప్రచారానికి పుల్ స్టాప్ పడినట్టయింది.