మెగా టీం కొత్త ట్రెండ్ మొదలెట్టేశారు

Update: 2016-04-15 09:30 GMT
సాధారణంగా ఆడియో ఫంక్షన్లలో ఓ ట్రెండ్ నడుస్తోంది. బాలయ్య - పవన్ - మహేష్ లాంటి బడా హీరోలు.. ఆడియో వేడుక పూర్తయిపోయాక చివర్లో సినిమాలోని ఓ డైలాగ్ చెప్పి ఫ్యాన్స్ ని అలరిస్తున్నారు. ఈ డైలాగ్ చెప్పే ట్రెండ్ చాన్నాళ్లుగా ఉంది, ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది.

ఇప్పుడు మెగా హీరోలు ట్రెండ్ మార్చేసే పనిలో పడ్డారు. రీసెంట్ గా వైజాగ్ లో జరిగిన సరైనోడు ఆడియో విజయోత్సవ సభలో... తను మాట్లాడ్డం అయిపోయాక.. తనే వచ్చి ఓ స్టెప్ వేసి ఆకట్టుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఆన్ స్టేజ్ పై బన్నీ డ్యాన్స్ అందరినీ అలరించింది. ఇప్పుడు మెగా సుప్రీం స్టార్ సాయిధరం తేజ్ కూడా సేమ్ సీన్ రిపీట్ చేశాడు.

సుప్రీమ్ మూవీలోని ఓ పాటకు డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నాడు తేజు. డైలాగుల ట్రెండ్ పాతదైపోవడంతో.. ఇప్పుడు ఈ స్టెప్పుల ట్రెండ్ ని స్టార్ట్ చేసినట్లున్నారు మెగా హీరోలు. మరి దీన్ని ఏఏ హీరోలు ఫాలో అవుతారో చూడాల్సిందే.
Tags:    

Similar News