ఒకేసారి రెండు మూడు భాషల్లో సినిమాలు తెరకెక్కించడం గౌతమ్ మీనన్ స్టైల్. ప్రస్తుతం శింబుతో తమిళంలో, తెలుగులో నాగచైతన్యలతో `సాహసం శ్వాసగా సాగిపో` తెరకెక్కిస్తున్నాడు. ఆ చిత్రం తర్వాత ఏకంగా నాలుగు భాషల్లో సినిమా చేయడానికి ప్లాన్ చేసుకొన్నట్టు సమాచారం. అందులో సాయిధరమ్ తేజ్ - అనుష్క - తమన్నా - పృథ్వీరాజ్ - పునీత్ రాజ్ కుమార్ ప్రధాన పాత్రధారులుగా నటించబోతున్నారట. ఆ విషయాన్ని గౌతమ్ మీనన్ తమిళ మీడియాకి చెప్పేశాడు. ఒక సినిమాని ఒక భాషలో తెరకెక్కించడమే కష్టం, ఇక నాలుగు భాషల్లో ఎలా తెరకెక్కిస్తాడో, దానికి ఎంత సమయం కావాలో అర్థం కావడం లేదు. కానీ గౌతమ్ మీనన్ మాత్రం ఎలాగైనా ఆ కథని నాలుగు భాషల్లో తెరకెక్కించాల్సిందే అని డిసైడ్ అయ్యాడట.
అనుష్క - తమన్నాలు ఇప్పటికే కాల్షీట్లు కూడా ఇచ్చేశారని తెలిసింది. సాయిధరమ్ తేజ్ కూడా గౌతమ్ మీనన్ ఎప్పుడంటే అప్పుడు రంగంలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇటీవలే సాహసం శ్వాసగా సాగిపో ఆడియో వేడుకకి హాజరైన సాయిధరమ్ తేజ్ తనని గౌతమ్ మీనన్ ప్రేమకథలు ఎంతగా ప్రభావితం చేశాయో చెప్పాడు. ఇంతలోనే ఆయనకి తన సినిమాలో నటించే ఛాన్సిచ్చేశాడు గౌతమ్. మొత్తంగా తేజు అదృష్టవంతుడే.