మావ‌య్య పేరు చెప్ప‌డానికి నాకేం ప్రాబ్లెమ్ - సాయిధ‌ర‌మ్

Update: 2016-08-11 17:34 GMT
అస‌లే ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానుల‌కు, అల్లు అర్జున్‌ కు మ‌ధ్య కోల్డ్ వార్ న‌డుస్తుంటే.. ఆ మ‌ధ్య తిక్క ఆడియో వేడుక‌లో సాయిధ‌ర‌మ్ తేజ్.. ప‌వ‌ర్ స్టార్ నినాదాలు చేస్తున్న అభిమానుల్ని మ‌రింత ఉత్సాహ‌ప‌రిచి.. వారికి మ‌ద్ద‌తుగా నిలిచి.. బ‌న్నీకి ప‌వ‌న్ అభిమానుల‌కు మ‌ధ్య అగాథాన్ని మ‌రింత పెంచేలా చేశాడు. దీంతో వివాదం మ‌రో కొత్త మ‌లుపు తీసుకుంది. సాయిధ‌ర‌మ్ ఉద్దేశ‌పూర్వ‌కంగానే ఇలా చేశాడ‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మయ్యాయి. మ‌రి ఇంత‌కీ సాయిధ‌ర‌మ్ ఉద్దేశ‌మేంటి.. ఎందుకు ఆ రోజు అత‌ను అలా చేశాడు.. ఓ ఇంట‌ర్వ్యూలో దీనిపై క్లారిటీ ఇచ్చాడు తేజు. అత‌నేమ‌న్నాడో చూద్దాం ప‌దండి.

‘‘నేను అభిమానుల స్థాయి నుంచి వ‌చ్చిన‌వాడినే. ఫ్యాన్స్ ఏం కోరుకుంటారో నాకు తెలుసు. అయినా...వాళ్లు ఎవ‌రి గురించి చెప్ప‌మంటున్నారు ప‌వ‌ర్ స్టార్. ఆయ‌న నాకు ఏమ‌వుతారు.. మావ‌య్య‌. మ‌రి...మా మావ‌య్య పేరు చెప్ప‌మంటే నాకు సంతోష‌మే కానీ... అభ్యంత‌రం ఏముటుంది.?  మా మావ‌య్య పేరు చెప్ప‌డానికి నాకు మాత్రం ఎలాంటి అభ్యంత‌రం లేదు. ఒక విష‌యాన్ని ఒక్కొక్క‌రు ఒకేలా డీల్ చేస్తుంటారు. నేను అలా చేశాను. దీనిపై వివాదాలు అన‌వ‌స‌ర‌మ‌ని నా అభిప్రాయం’’ అని సాయిధ‌ర‌మ్ అన్నాడు.

Full View

Full View
Tags:    

Similar News