రెజీనాతో ఎఫైర్.. విషయం తేల్చేసిన తేజు

Update: 2016-06-01 10:22 GMT
సుప్రీమ్ మూవీ సక్సెస్ తో హ్యాట్రిక్ విజయాలు సాధించిన యంగ్ హీరోగా అవతరించాడు మెగా మేనల్లుడు సాయిధరం తేజ్. ఇప్పటికే మెగాభిమానుల నుంచి సుప్రీమ్ హీరో అని కూడా పిలిపించుకునే రేంజ్ కి వచ్చేశాడు.

కనీసం 20 కోట్ల మార్కెట్ ఉన్న హీరోగా అవతరించిన తేజుపై.. రూమర్స్ చాలానే వినిపిస్తుంటాయి. సాయిధరం తేజ్ పై వినిపించే రూమర్లలో ప్రధానమైనది మరో యంగ్ హీరోయిన్ రెజీనా కసాండ్రాతో ఎఫైర్ అనే. వరుసగా సినిమాలు చేయడం, ఇద్దరూ కలిసి పార్టీలకు అటెండ్ అవుతూ ఉండడం, ఏవైనా ఫంక్షన్లలో కలిసి కనిపించడం, పలుమార్లు మీడియా కంటికి చిక్కడం.. ఇలాంటివన్నీ కలిపి ఓ స్ట్రాంగ్ డెసిషన్ కి మీడియా వచ్చేసింది. తేజు-రెజీనాలు లవ్ లో ఉన్నారని.. వీరి మధ్య ఎఫైర్ నడుస్తోందనే టాక్ వినిపించింది. దీనిపై స్పందించాడు సాయిధరం తేజ్.

'ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేసేవాళ్లను ఏమని అనాలో తెలీడం లేదు. ఇలాంటి వాటికి నేను అసలు స్పందించను, పట్టించుకోను, కానీ రెజీనాపై ఇలాంటి రావడంతో ఫీల్ కావాల్సి వస్తోంది. ఇలాంటి రూమర్లతో ఇబ్బందులు పడుతున్న మరికొందరు అమ్మాయిలు ఇండస్ట్రీలో ఉన్నారు. ప్రజలు వీరిపై గౌరవం ఉంచాల్సిన అవసరం ఉంది' అంటున్నాడు సాయిధరం తేజ్. అన్నీ కరెక్టే కానీ తేజు.. నీ క్లారిఫికేషన్ లో మరో డౌట్ వచ్చేస్తోంది. మిగతా వాళ్ల గురించి రూమర్స్ వచ్చినపుడు పట్టించుకోకుండా.. రెజీనా గురించి రూమర్స్ అనే సరికి స్పందిస్తే.. డౌట్స్ రాకుండా ఎలా ఉంటాయ్ చెప్పు.
Tags:    

Similar News