ఆచితూచి మాట్లాడటం.. వ్యక్తిగత విషయాల్ని పెద్దగా షేర్ చేయకపోవటం లాంటివి సినిమా ఇండస్ట్రీలో కామన్. ఆ మాటకు వస్తే ప్రముఖులు ఎవరూ ఓపెన్ కారు. ఎందుకంటే వారు మాట్లాడే ప్రతి మాటా వారి ఇమేజ్ మీద ప్రభావం చూపిస్తుంది. అయితే.. అలాంటివేమీ పెట్టుకోకుండా మొహమాటం లేకుండా తన లోపలి ప్రేమికుడ్ని ఆవిష్కరించారు మెగా క్యాంప్ కుర్ర హీరో సాయి ధరమ్ తేజ్. రీల్ లైఫ్ ముచ్చట్లు కాకుండా రియల్ లైఫ్ ముచ్చట్లు చెప్పేసి అందరిని హాయిగా నవ్వించేసిన అతగాడు తన మూడు ఫెయిల్యూర్ లవ్ ఎపిసోడ్ల గురించి చెప్పుకొచ్చాడు.
గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వస్తున్న సాహసం శ్వాసగా సాగిపో ఆడియో ఫంక్షన్లో మాట్లాడిన తేజ్.. గౌతమ్ సినిమాల ప్రభావంతో మూడుసార్లు ఎదురుదెబ్బలు తిన్నట్లుగా చెప్పాడు. ఆయన సినిమాల ప్రభావంతో మూడుసార్లు లవ్ లో పడ్డానని.. మూడుసార్లు దెబ్బ పడిందని చెప్పుకొచ్చాడు. ఏదో పైపైకి మాటలన్నట్లు కాకుండా గౌతమ్ ఏ సినిమాలు తన మీద ప్రభావం చూపించాయో డీటైల్డ్ గా వెల్లడించాడు.
‘షుర్షణ’ సినిమా చూశాక బాగా చదువుకున్న అమ్మాయితో ప్రేమలో పడాలని భావించి.. అమెరికాలో ఉన్న ఓ అమ్మాయికి ప్రపోజ్ చేద్దామని వెళ్లేసరికి.. అమ్మడు మరొకరితో ఎంగేజ్ అయిపోయిందని.. చేసేదేమీ లేక వెనక్కి వచ్చేశానన్నాడు. తర్వాత ‘ఏం మాయ చేశావే’ చూసి మరో అమ్మాయిని ప్రేమించానని.. ఆ అమ్మాయి దగ్గరకు వెళితే ముందు కెరీర్ మీద ఫోకస్ చేయి అని చెప్పటంతో వర్క్ వుట్ కాలేదని.. ఆ తర్వాత ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ చూసి మరోసారి ఇంకో అమ్మాయి ప్రేమలో పడితే తను సైతం హ్యాండ్ ఇచ్చిందన్నాడు. మూడు వన్ సైడ్ ప్రేమలతో ఎదురుదెబ్బలు తిన్న తాను.. సాహసం శ్వాసగా సాగిపో అంటూ డిసైడ్ అయ్యానని చెబితే అందరి మనసుల్ని దోచుకున్నాడు. తన మీద గౌతమ్ ప్రభావం ఎంత ఉందన్న విషయాన్ని ఆయనకు గుర్తు ఉండిపోయేటట్లు చెప్పినట్లు కనిపించట్లేదు..? చూస్తుంటే.. తేజ్ లో చాలా విషయమే ఉందండోయ్.