తొలి సినిమాతోనే టాలీవుడ్ పై బలమైన ముద్ర వేసిన దర్శకుల్లో సాయికిరణ్ అడివి ఒకరు. శేఖర్ కమ్ముల శిష్యుల్లో ఒకడైన సాయికిరణ్ దర్శకుడిగా మారి చేసిన తొలి ప్రయత్నం ‘వినాయకుడు’ తెలుగు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత దీనికి సీక్వెల్ గా తీసిన ‘విలేజ్ లో వినాయకుడు’ మాత్రం అంతగా ఆడలేదు. ఆ తర్వాత బాగా గ్యాప్ తీసుకుని.. ఈ మధ్యే దిల్ రాజు నిర్మాణంలో ‘కేరింత’ తీశాడు సాయికిరణ్. ఆ సినిమా తెలుగు ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంది. ఆ సినిమా ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో తన తర్వాతి సినిమాకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడీ యంగ్ డైరెక్టర్.
ఈసారి సాయికిరణ్ తన తమ్ముడు శేష్ అడివితో జత కడుతున్నాడు. అతడు హీరోగా ఓ ప్రయోగాత్మక సినిమా తీయబోతున్నాడు. స్క్రిప్టు రెడీ అయిపోయింది. నటీనటుల్ని - నిర్మాతను వెతికే ప్రయత్నంలో ఉన్నారు. లావణ్య త్రిపాఠి లేదా నందిత.. ఈ ఇద్దరిలో ఒకరిని హీరోయిన్ గా తీసుకుందామనుకుంటున్నారు. ప్రొడ్యూసర్ కూడా దాదాపుగా ఓకే అయినట్లు సమాచారం. ఇంతకముందు తమ్ముడు శేష్ తో కర్మ - కిస్ అనే రెండు సినిమాలు నిర్మించాడు సాయికిరణ్. ఆ సినిమాలకు దర్శకుడు కూడా శేషే. కానీ అవి దారుణమైన ఫలితాల్నిచ్చాయి. ఐతే ఈసారి తమ్ముడిని తనే డైరెక్ట్ చేయబోతున్నాడు.