తెలుగులో తన తొలిసినిమా 'ఫిదా'తో హీరోయిన్ సాయిపల్లవి జనాలను బాగానే పడేసింది. తెలంగాణలో అంటే ఆమె తెలంగాణ యాసకు పడిపోయారని అనుకోవచ్చు కాని.. తెలుగు రాష్ట్రాల్లోని మిగతా ప్రాంతాల్లో కూడా ఈమె హవభావాలకూ నడుం తిప్పుళ్ళకూ బాగానే అభిమానులు ఏర్పడ్డారు. కాకపోతే అమ్మడు ఈ సందర్భంగా తన తదుపరి చిత్రాల దర్శకులకు ఒక షాకిచ్చింది.
అసలు సాయి పల్లవికి గ్లామరస్ అనే పదమే నచ్చదట. ఆమె కొనుక్కున్న డిక్షనరీలో ఆ పదం లేదని తేల్చేసింది. కాకపోతే 'ఫిదా' సినిమాలో అమ్మడు అమెరికాలో జరిగే ఒక సీన్ కోసం జబ్బలు లేని (స్లీవ్ లెస్) డ్రస్సు ఒకటి వేసుకుంటుంది. ఆ సీన్లో చాలా సెక్సీగానే ఉందిలే. అయితే ఈ సీన్ ను మరోసారి మరో సినిమాలో చూడాలంటే మాత్రం నో ఛాన్స్ అంటోంది ఈ తమిళ బ్యూటి. ''నేను అసలు గ్లామర్ దుస్తులు వేసుకోవడానికి ఇష్టపడను. సినిమాల్లో అమ్మాయిలను అలా చూసి ఒకరకమైన అభిప్రాయానికి వస్తారు జనాలు. ఫిదా సినిమాలో కూడా శేఖర్ కమ్ముల గారు చాలా రిక్వెస్ట్ చేస్తేనే ఆ డ్రస్సు వేసుకున్నాను. ఇకపై మాత్రం అలాంటి డ్రస్సు వేసుకునే ఛాన్సే లేదు'' అంటోందీ సుందరి.
దీని బట్టి చూస్తుంటే.. అసలు ఆ సీన్లో అమ్మడిని ఆ డ్రస్సులో చూపించడానికి శేఖర్ కమ్మలు చాలానే కష్టపడ్డాడనమాట. ఓ రకంగా చెప్పాలంటే బలవంతంగా ఆమెతో ఆ డ్రస్ వేయించాడనమాట. ఏదేమైనా కూడా సాయిపల్లవిని ఇప్పుడు గ్లామర్ యాంగిల్ లో చూద్దామని అనుకునేవారే తక్కువ. ఒకవేళ ఎవరన్నా అనుకున్నా కూడా.. ఇప్పుడు అలాంటి కలలు కనడం మానేయండే!!