ఈ భానుమతి హైబ్రిడ్ పిల్ల

Update: 2017-07-11 04:15 GMT
శేఖర్ కమ్ముల సినిమా అంటే ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయో మనకు బాగానే తెలుసు కదా. అమ్మాయిలు ఏమో  పెంకితనం, అబ్బాయిలు  ఏమో నెమ్మది; ఇంకా కొంచం కుటంబం మరి కొంచం మెట్రో లవ్ కలిపి ఒక కాఫీ లాంటి సినిమాను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. చాల కాలం తరువాత మళ్ళీ మరో కొత్త ప్రేమ కథ  ‘ఫిదా’ తో వస్తున్నాడు. ఈ సినిమాలో కొన్ని పాటలు ఇప్పటికే యూట్యూబ్లో విడుదలై మంచి టాక్ సంపాదించింది. ఫిదా సినిమా ఆడియో ఫంక్షన్ నిన్న రాత్రి హైదరాబాద్ లో జరిగింది. ఈ ఫంక్షన్ మొత్తానికి సాయి పల్లవి తెలుగు స్పీచ్ హైలైట్ అనే చెప్పాలి. తెలుగు అమ్మాయి కాకపోయినా తెలుగు మాట్లాడటానికి గట్టిగానే ప్రయత్నం చేసింది.

ప్రేమమ్ సినిమాతో సౌత్లో ఇప్పుడు స్టార్ హీరోయిన్ క్రేజ్ ఏర్పడింది సాయి పల్లవికి. ఈ సినిమాలో కూడా తన నటనతో హావభావాలుతో రాని తెలుగును వంకరగా అందంగా మాట్లాడుతూ అందరిని అలరిస్తుంది అనే అనిపిస్తుంది. “నేను ఈ సినిమా చేస్తున్న అన్నప్పుడే ఫిక్స్ అయ్యా ఆడియో ఫంక్షన్లో తెలుగులోనే మాట్లాడాలని. అందుకే నేర్చుకున్న కొంచం తెలుగులోనే మాట్లాడుతాను. విని తప్పులు ఉంటే క్షమించండి. ముందు నాకు ఇలాంటి అమ్మాయి పాత్ర ఇచ్చినందుకు శేఖర్ గారికి చాల థాంక్స్. అలాగే దిల్ రాజు గారి నాకు ఇచ్చిన సపోర్ట్ నేను ఎప్పటికీ మరిచిపోలేను. నన్ను ఒక కూతురులా చూసుకున్నారు. నాకు ఈ సినిమా వలన ఒక ఫ్యామిలి దొరికింది. ఇది తెలుగా లేక తెలంగాణ నాకు తెలియదు. కానీ ఈ సినిమాలో ఈ పాత్ర చేయడం వలన నాకు చాల హెల్ప్ అయ్యింది. అమ్మాయి అంటే ఎలా ఉండాలి వాళ్ళ హక్కులు ఏంటి వాళ్ళ ఎలా ఆలోచిస్తారు అన్నీ నాకు ఇంకా బాగా అర్ధం చేసుకునే అవకాశం వచ్చింది'' అంటూ అలరించింది సాయి పల్లవి.

అయితే ఏదన్నా ఒక డైలాగ్ చెప్పు అని యాంకర్ అడిగితే.. మాంచి జోష్ లో ఒక మాటనేసింది. “భానుమతి ఇక్కడ ఒకటే పీస్ రెండు మతాలు రెండు  కులాలు హైబ్రిడ్ పిల్ల'' అని అదరగొట్టేసింది. పైగా ఇలా రెండు మతాలు.. రెండు కులాలు.. అని చెప్పడంతో అసలు సినిమాలో ఏముందా అంటూ అందరూ స్టన్ అయిపోతున్నారు. అది సంగతి.
Tags:    

Similar News