సాయిపల్లవి ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ కోసం వెయిట్ చేస్తోంది. 'లవ్ స్టోరీ' .. 'శ్యామ్ సింగ రాయ్' వంటి రెండు భారీ హిట్లను తన ఖాతాలో వేసుకున్న ఆమె, ఆ తరువాత సినిమాగా వస్తున్న 'విరాటపర్వం' కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తోంది. వేణు ఉడుగుల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కథ అంతా కూడా సాయిపల్లవి చుట్టూనే తిరుగుతుంది. ఆమె జోడీగా రానా కనిపించనున్న ఈ సినిమా, ఈ నెల 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో సాయిపల్లవి 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' కార్యక్రమంలో పాల్గొంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ప్రోమో రన్ అవుతోంది. రాధాకృష్ణ అడిగిన ప్రశ్నలకు సమాధానంగా సాయిపల్లవి మాట్లాడుతూ .. " తమిళనాడులోని మారుమూల ప్రాంతానికి చెందిన నాకు, పుట్టపర్తి సాయిబాబానే పేరు పెట్టారు. ఇప్పటికీ నేను ఆయన భక్తురాలినే. సినిమా ఫీల్డ్ నా స్వభావానికి తగదని చాలామంది చెప్పారు .. అదే మాట మీరు అంటున్నారు. నిజం చెప్పాలంటే ఇంతవరకూ ఇక్కడ నాకు ఎలాంటి ఇబ్బంది ఎదురు కాలేదు.
ఒకవేళ అలా జరిగితే వెనక్కి వెళ్లిపోయి నా చదువేదో నేను చదువుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నేను చదువుకున్నాను అనే ఒక కాన్ఫిడెన్స్ నాకు ఉంది. అందువలన నేను ఈ విషయాన్ని గురించి పెద్దగా ఆలోచన చేయడం లేదు.
నా డాన్సుల ముందుకు హీరోలు కూడా వీక్ అవుతారని మీరు అంటున్నారు .. అయ్యో అలా మాత్రం అనకండి సార్. ఒక సందర్భంలో చిరంజీవిగారు నాతో డాన్స్ చేయాలనుంది అన్నారు. 'ముఠామేస్త్రి'లోని ఆయన స్టెప్పులను నేను ఎంతో ట్రై చేసేదానిని. ఇక 'అబీబీ ..' సాంగ్ లో కూడా ఆయన గ్రేస్ అంటే నాకు చాలా ఇష్టం.
' ఫిదా' నుంచి ఇప్పటి వరకూ నా సినిమాలకి నేను డబ్బింగ్ చెబుతూ వచ్చాను. నేను సంపాదించిన డబ్బు మా అమ్మకే ఇస్తుంటాను. నేను ఏది కొన్నా ఓటీపీ మా అమ్మకే వెళుతుంది. ఈ మధ్య మా ఇంట్లో నేను తెలుగు మాట్లాడుతున్నాను. దాంతో తెలుగు అబ్బాయిని చేసుకోమని మా పేరెంట్స్ అంటూ ఉంటారు.
వచ్చే ఏడాది నా పెళ్లి అవుతుంది .. 30 ఏళ్లు వచ్చేసరికి సరికి ఇద్దరు పిల్లలు ఉండాలని అనుకున్నాను" అంటూ తన మనసులోని మాటను చెప్పుకొచ్చింది. ఈ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేలా అనిపిస్తోంది. త్వరలోనే పూర్తి నెపిసోడ్ ప్రసారం కానుంది.