అల్లరి నరేష్ కథానాయకుడిగా నటించిన జేమ్స్ బాండ్ ఈ శుక్రవారం రిలీజైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నటించినందుకు నరేష్ కంటే కథానాయిక సాక్షి చౌదరి కి ఎక్కువ పేరొచ్చింది. డాన్ బుల్లెట్ పాత్రలో ఇరగదీసిందంటూ ప్రశంసలొస్తున్నాయి.
ఇదే విషయాన్ని సాక్షి స్వయంగా చెబుతూ.. ఈ సినిమా నాకోసమే తీసిన సినిమా. ఇందులో యాక్షన్ రాణీగా నేను చేసిన ఫైట్స్ చూసి అదిరిపోయాయని మెచ్చుకుంటున్నారంతా. డాన్ పాత్ర లో గొప్పగా నటించావ్ అంటూ ప్రశంసలొస్తున్నాయి. అయితే ఆ పాత్ర కోసం జిమ్నాస్టిక్స్ చేసుకుని ఎంతో శ్రమించాల్సొచ్చింది.
ఒకే సినిమాలో రెండు రకాల షేడ్స్ ఉన్న పాత్రలో అభినయించాల్సి వచ్చింది. పూజ ఓ సాంప్రదాయమైన అమ్మాయి, పూజ ఓ లేడీ డాన్.. ఇలా రెండు వేరియేషన్లు చూపించాల్సొచ్చింది. నటిగా ఇది నాకు చాలెంజింగ్ రోల్. కష్టించినందుకు ఇప్పుడిలా గుర్తింపు దక్కింది. చాలా సంతోషంగా ఉంది. అంటూ చెప్పుకొచ్చింది సాక్షి.
మనోజ్ సరసన ఓ సినిమాలో నటించిన ఈ అమ్మడికి జేమ్స్ బాండ్ రెండో సినిమా. అలాగే హిందీలో ఇస్మాయిల్ దర్బార్, తమిళ్ లో ఇరుతిల్ ఇరువర్ చిత్రాల్లో కథానాయికగా నటిస్తోంది. ఈ రెండు సినిమాలతో మరో రెండు పరిశ్రమల్లో ఈ భామ పాపులర్ కాబోతోంది. డాన్ బుల్లెట్టు గా ఆకట్టుకుంది కాబట్టి ఇక తెలుగులో వరుసగా అవకాశాలొస్తాయనడంలో సందేహం లేదు.