ఇండస్ట్రీలో అత్యంత అందమైన హీరోయిన్ ఆమేనన్న స్టార్ హీరో!

Update: 2019-06-02 14:04 GMT
సల్మాన్ ఖాన్ – కత్రినా కైఫ్.. వీళ్లిద్దరి మధ్యన ఉన్న అనుబంధం ఏమిటో చెప్పనక్కర్లేదు. ఒక దశలో వీరిద్దరూ ప్రేమికులుగా ఉండే వారు. ఐశ్వర్య రాయ్ తో బ్రేకప్ అయ్యాకా సల్మాన్ ఖాన్ ప్రేమాయణం నడిపించింది కత్రినా కైఫ్ తోనే. అప్పట్లో వివిధ కేసులతో సల్మాన్ జైలు పాలు కాగా.. జైలు బయట కనిపించి కన్నీళ్లు పెట్టుకుంది కత్రినా కైఫ్. అలా సల్మాన్ కు ప్రియురాలిగా గుర్తింపు తెచ్చుకుంది కత్రినా కైఫ్.

అయితే ఏమైందో ఏమో  కానీ వీరిద్దరికీ బ్రేకప్ అయ్యింది. కత్రినాకు హీరోయిన్ గా అవకాశాలు రావడంలో కూడా సల్మాన్ ఖాన్ చాలా కీలక పాత్ర పోషించాడు. ఆమె బాలీవుడ్ లో అనామకురాలిగా ఉన్న సమయంలోనే సల్మాన్ ఆమెకు ఊపునిచ్చాడు. తన సినిమాలో అవకాశం ఇచ్చి ఆమెను ప్రోత్సహించాడు. అలాగే వివిధ సినిమాలకు ఆమెను రెకమెండ్ చేశాడు.

అలా వీరిద్దరి బంధం దాదాపు దశాబ్దంన్నర నుంచి కొనసాగుతూ ఉంది. బ్రేకప్ తర్వాత కూడా సల్మాన్ ఖాన్ ఆమెతో సన్నిహితంగానే ఉంటున్నాడు. వీరిద్దరూ కలిసి నటిస్తూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో వీరి కాంబోలో మరో సినిమా వస్తోంది. ‘భారత్’ పేరుతో రూపొందిన ఆ సినిమా త్వరలోనే విడుదల కానుంది.

ఈ సందర్భంగా సల్మాన్ మాట్లాడుతూ.. కత్రినా కైఫ్ కు ఒక గొప్ప ట్యాగ్ ఇచ్చాడు.  'ఇండస్ట్రీలో అత్యంత అందమైన హీరోయిన్ ఆమె..' అంటూ సల్మాన్ ఖాన్ తన సహచర హీరోయిన్ ని కీర్తించాడు. ఆమె ఎప్పటికప్పుడు నటనను మెరుగు పరుచుకుంటోందని, ప్రతి షాట్ కూ ఆమె నటనా ప్రతిభ మెరుగుపడుతోందని సల్మాన్ ఖాన్ చెప్పుకొచ్చాడు!


Tags:    

Similar News