ఒక్కో భంగిమ‌తో మ‌తులు చెడగొడుతోంది!

Update: 2022-04-05 04:30 GMT
బాలీవుడ్ లో అనుష్క శ‌ర్మ‌.. దీపిక ప‌దుకొనే లాంటి ఫ్యాష‌నిస్టాల‌కు ధీటుగా సౌత్ లో స‌మంత ఫ్యాష‌నిస్టా వైబ్స్ తో వెలిగిపోతున్న సంగ‌తి తెలిసిందే. సీనియ‌ర్ స్టార్ల‌ను ఇమ్మిటేట్ చేస్తున్నా స‌మంత త‌న‌దైన యూనిక్ నెస్ తో తెలుగు ఫిలింసర్కిల్స్ లో నిరంత‌రం హాట్ టాపిక్ గా మారుతోంది. ఎంపిక చేసుకునే బ్రాండ్స్ యాక్సెస‌రీస్ స‌హా ప్ర‌తిదీ యూనిక్ గా ఉండేలా స‌మంత తీసుకునే శ్ర‌ద్ధ గురించి చెప్పాల్సిన ప‌ని లేదు. ఇక ఇటీవ‌లి వ్య‌క్తిగ‌త‌ ఒడిదుడుకుల అనంత‌రం స‌మంత‌లోనే గ్లామ‌ర్ ఎలివేష‌న్ హ‌ద్దులు చెరిపేస్తోంద‌న్న గుస‌గుస వినిపిస్తోంది. ఊ అంటావా .. సాంగ్ బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యాక స‌మంత మ‌రింత‌గా చెల‌రేగిపోతోంద‌ని ఫ్యాన్స్ లో చ‌ర్చ సాగుతోంది.

ఇదిలా ఉండ‌గానే స‌మంత ప్ర‌ముఖ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ షూట్ లో దుమారం రేపింది. సామ్ టూ హాట్ లుక్ తో మ‌తులు చెడ‌గొట్టింది. ఈ సిరీస్ లో కొన్ని త్రోబ్యాక్ ఫోటోల‌ను షేర్ చేస్తూ ఫ్రెష్ వైబ్స్ ని క్రియేట్ చేస్తోంది సామ్. త‌ను షేర్ చేసిన ఇన్ స్టా ఫోటో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. స‌మంత నియాన్ క‌ల‌ర్ లూజ్ టాప్ లో ఇన్న‌ర్ అందాల‌ను ఎలివేట్ చేసిన తీరు మ‌తులు చెద‌ర‌గొట్టింది. ఫ్లోర‌ల్ బాట‌మ్ కి అనుసంధానంగా సామ్ టాప్ ని ఎంపిక చేసుకుంది.

చైత‌న్య‌తో మ‌ళ్లీ క‌లుస్తోందా?

టాలీవుడ్ మహిళా దర్శకుల ప్రయత్నాల కారణంగా సమంత - నాగ చైతన్య మళ్లీ కలుస్తున్నార‌ని ఇటీవ‌ల గుస‌గుస వైర‌ల్ అవుతోంది.గత సంవత్సరం ఈ జంట‌ 4వ వివాహ వార్షికోత్సవానికి ముందు విడిపోయినట్లు ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత ఎవ‌రికి వారు కెరీర్ ప‌రంగా బిజీ అయిపోయారు. వ‌రుస సినిమాల్లో న‌టిస్తున్నారు. స‌మంత ఇటీవ‌ల బాలీవుడ్ లో రాణించేందుకు అవ‌స‌ర‌మైన ప్ర‌ణాళిక‌ల్ని సిద్ధం చేసిన సంగ‌తి తెలిసిందే.

అయితే ఇంత‌లోనే చై - సామ్ క‌లుస్తున్నార‌ని.. ఆ ఇద్ద‌రి కామ‌న్ ఫ్రెండ్ అయిన‌ ద‌ర్శ‌కురాలు నందిని రెడ్డి తన త‌దుప‌రి చిత్రం కోసం సామ్ - చైని మళ్లీ తెరపై కలిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. 2019 లో ఓ బేబీ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ని అందించిన నందిని రెడ్డికి సామ్ ఓకే చెప్పింద‌న్న టాక్ కూడా వినిపిస్తోంది. ఇప్ప‌టికే నందిని రెడ్డి ఆ జంట‌ను క‌లుపుతూ మరొక స్క్రిప్ట్ ను వివరించారని టాక్ వినిపించింది.

అయితే సామ్ ని ఇబ్బంది పెట్టే ఉద్ధేశం లేక‌ నాగ చైతన్య స‌ర‌స‌న నాయిక‌ పాత్ర కోసం వేరొక హీరోయిన్ ని వెతుకుతున్నట్లు కూడా ఒక వ‌ర్గం లో ప్ర‌చారం సాగుతోంది. ఈ వార్తలపై త్వరలో ద‌ర్శ‌కురాలు నందిని రెడ్డి క్లారిటీనిస్తార‌నే భావిస్తున్నారు. ఏప్రిల్ 28న సమంత న‌టించిన `కాతు వాకుల రెండు కాదల్` విడుద‌ల‌వుతోంది. విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించగా.. విజయ్ సేతుపతి- నయనతార జంటగా నటించారు. స‌మంత కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నుంది.
Tags:    

Similar News