ప‌బ్బుల్లో దుమ్ము రేపుతున్న స‌మంత‌

Update: 2021-12-16 05:33 GMT
అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా న‌టించిన తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప- ది రైజ్` ఈనెల 17న ప‌లు భాష‌ల్లో అత్యంత భారీగా విడుద‌ల‌వుతున్న సంగ‌తి తెలిసిందే. సుకుమార్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా ర‌ష్మిక క‌థానాయిక‌గా న‌టించింది. ఈ సినిమాలో స‌మంత స్పెష‌ల్ సాంగ్ ఇప్పుడు ట్రెండీ టాపిక్ గా మారింది.

ఊ అంటావా మావా..ఉహు ఉహు అంటావా మావ ..! అంటూ సాగే పెప్పీ నంబ‌ర్ కి రాక్ స్టార్ దేవీశ్రీ ఇచ్చిన ట్యూన్ యూత్ లోకి దూసుకెళ్లింది. జాన‌ప‌ద గాయ‌ని ఇంద్రావ‌తి హ‌స్కీ వాయిస్ ఈ పాట‌కు పెద్ద ప్ల‌స్ గా మారింది. ఇంటా బ‌య‌టా ఈ స్పెష‌ల్ పాట మోతెక్కిస్తోంది. ముఖ్యంగా ఈ ప్ర‌త్యేక గీతంలో స‌మంత న‌డుము ఊపుడుతో కిక్కిచ్చే స్టెప్పులు వేసింది. ఎన‌ర్జిటిక్ బ‌న్నీతో క‌లిసి స్టెప్పు క‌లిపింది సామ్. ఈ పాట రిలీజ్ కాగానే.. చైత‌న్య నుంచి విడాకుల అనంత‌రం సామ్ మ‌రో లెవ‌ల్లో రెచ్చిపోయిందంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇటీవ‌ల‌ కాపీ క్యాట్ వివాదంలోనూ చిక్కుకున్న సంగ‌తి తెలిసిందే.

ఇక స‌మంత మ‌రీ ఇంత‌గా రెచ్చిపోవ‌డంపై ర‌క‌ర‌కాల విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. మ‌గ‌వాళ్ల వంక‌ర బుద్ధి అంటూ చంద్ర‌బోస్ రాసిన ప‌ద‌జాలం కూడా ఒక సెక్ష‌న్ కి మింగుడు ప‌డ‌డం లేదు. మ‌గ‌ళ్ల‌ను కించ‌ప‌రిచేలా ఉందంటూ ఏపీలో మ‌గాళ్ల సంఘం ఫిర్యాదు చేసింది. ఓ వైపు పురుషుల‌కు అవ‌మానం జ‌రిగిందంటూ మ‌గాళ్ల సంఘం కోర్టుకెక్కగా.. మ‌రోవైపు మ‌హిళా సంఘం కౌంట‌ర్ గా దిగి స‌మంత‌కు పాలాభిషేక్ చేయ‌డం ర‌క్తి క‌ట్టించింది. బ‌హుశా సినిమా హిస్ట‌రీలో ఏ ఐట‌మ్ నంబ‌ర్ ఇంత‌గా వివాదాల‌కెక్క‌లేదు అంటే అతిశ‌యోక్తి కాదు.

ఓవైపు వివాదాలు కొన‌సాగుతుంటే ..  ఈ పాట ప‌బ్బు క్ల‌బ్బుల్లో ఒక రేంజులో ఊపేస్తోంది. ఎక్క‌డ చూసినా యూత్ ఈ పాట‌కు స్టెప్పులేస్తూ జిల్ల‌నిపించేస్తున్నారు. మ‌రోవైపు సామాజిక యాప్ ల‌లోనూ వీడియో క్లిప్పింగులు ఒక రేంజులో వైర‌ల్ అవుతున్నాయి.

Tags:    

Similar News