బాబోయ్‌ సామ్‌ నువ్వు మళ్లీ గ్రేట్‌

Update: 2020-03-07 08:59 GMT
సినిమా హీరోలైనా హీరోయిన్స్‌ అయినా ఫిట్‌ గా ఉండేందుకు ప్రతి రోజు జిమ్‌ లో గంటల తరబడి వర్కౌట్స్‌ చేస్తారనే విషయం తెల్సిందే. బద్దకస్తులు అయినా కూడా ఎంతో కొంత సమయం జిమ్‌ లో గడపాల్సిందే. లేదంటే వారు చాలా త్వరగా సినిమా నుండి క్విట్‌ అవ్వాల్సి వస్తుంది. అయితే కొందరు మాత్రం అవసరానికి మించి కష్టపడుతూ ఉంటారు. బాబోయ్‌ ఇంత కష్టం అవసరమా అని చూసే వారికే అనిపిస్తుంది. సమంత పడుతున్న కష్టం చూస్తే అంతా అలాగే అనుకుంటారు.

సుకుమారి అయిన సమంత జిమ్‌ లో చేసే వర్కౌట్స్‌ అన్నీ ఇన్నీ కావు. చాలా క్లిష్టమైన.. కష్టమైన వర్కౌట్స్‌ ను ఆమె ఎక్కువగా చేస్తూ ఉంటుంది. మూడు పదుల వయసుకు వస్తున్నా కూడా ఏమాత్రం అందం చెదరకూడదనే ఉద్దేశ్యంతో సమంత కష్టమైన వర్కౌట్స్‌ చేస్తుంటుందని అంటూ ఉంటారు. కొన్ని రోజుల క్రితం వంద కేజీల వెయిట్‌ లిఫ్ట్‌ చేసి బాబోయ్‌ అనిపించిన సమంత మరోసారి అదే ఫీట్‌ ను చేసింది.

ప్రస్తుతం సోషల్‌ మీడియా లో ఈ అమ్మడు వెయిట్‌ లిఫ్ట్‌ వీడియో వైరల్‌ అవుతుంది. మరో సారి వంద కేజీల బరువు మోయడం పట్ల అంతా కూడా అభినందిస్తున్నారు. ఫిజికల్‌ ఫిట్‌ నెస్‌ పై సమంతకు ఉన్న శ్రద్దను చూస్తుంటే ముచ్చటేస్తుంది అంటూ నెటిజన్స్‌ ప్రశంసలు కురిపిస్తున్నారు. సమంత వెయిట్‌ లిఫ్టింగ్‌ తో పాటు పలు వర్కౌట్స్‌ రెగ్యులర్‌ గా చేస్తుంది కనుకే ఇంత ఫిట్‌ గా అందంగా ఉందంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.
Tags:    

Similar News