ఇదీ వ‌ర్క‌వుట్ కాక‌పోతే.. ఐ డోంట్ నో!

Update: 2019-07-04 17:30 GMT
ఫ్లాప్ ని ఫ్లాప్ అని ఎలాంటి భేష‌జం లేకుండా అంగీక‌రించే వాళ్లున్నారా?  లేడీ ఓరియెంటెడ్ కి ఇంకా తెలుగులో అంత సీన్ లేద‌ని నిజాయితీగా అంగీక‌రించే నాయిక‌లు ఉన్నారా? .. అంటే ఈ రెండు విష‌యాల్లో స‌మంత నిజాయితీని మెచ్చుకుని తీరాలి. ఉన్న‌ది ఉన్న‌ట్టు కుండ‌బ‌ద్ధ‌లు కొట్టిన‌ట్టు మాట్లాడి షాకిచ్చారు స‌మంత‌. త‌న కోసమే జ‌నాలు థియేట‌ర్ల‌కు రార‌ని నిజాయితీగా అంగీక‌రించ‌డ‌మే కాదు.. గ‌త చిత్రం యూట‌ర్న్ ఫ్లాపైంద‌ని అంగీక‌రించారు. ఈ శుక్ర‌వారం `ఓ బేబి` రిలీజ్ సంద‌ర్భంగా స‌మంత హైద‌రాబాద్ లో మీడియాతో ముచ్చ‌టిస్తూ పైవిధంగా స్పందించారు.

`ఓ బేబి` ఓ ప్ర‌త్యేక‌మైన జాన‌ర్ మూవీ. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు ఎంత మంది వ‌స్తారు? అన్న‌ది.. ఎంత‌వ‌ర‌కూ నా కోసం వ‌స్తున్నారు? అన్న‌ది తెలీదు. కేవ‌లం నా కోస‌మే జ‌నాలు థియేట‌ర్ల‌కు వ‌స్తారని నేను అనుకోను. మ‌న‌కు ఇంకా అలా లేదు. మ‌హేష్- చ‌ర‌ణ్‌-ఎన్టీఆర్- అల్లు అర్జున్- ప్ర‌భాస్ లాంటి స్టార్లు మాత్ర‌మే జ‌నాల్ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌గ‌ల‌రు. నేను ఎంత‌వ‌ర‌కూ పుల్ చేయ‌గ‌ల‌ను అన్న‌ది గెస్ చేయ‌లేను. అందుకే ఓ బేబి నా సామ‌ర్థ్యానికి టెస్ట్ అని భావిస్తున్నా. జ‌నాలు థియేట‌ర్ల వ‌ర‌కూ వ‌స్తే న‌చ్చేతుంది. కానీ రావాలి కదా..!! అని స‌మంత‌ అన్నారు.

థ్రిల్ల‌ర్లు చూసేందుకు జ‌నం థియేట‌ర్ల‌కు వ‌స్తారు. థ్రిల్ల‌ర్ కి లేడీ ఓరియెంటెడ్ క‌లిపి చేస్తే బావుంటుంద‌ని `యూట‌ర్న్‌` చిత్రంతో ప్ర‌య‌త్నించాం. ఆ సినిమాకి రివ్యూలు బాగా వ‌చ్చాయి. కానీ జ‌నాలు థియేట‌ర్ల వ‌ర‌కూ రాలేదు. బాగా వ‌సూళ్లు తేలేక‌పోయింది. అందుకే ఈసారి యూనివ‌ర్శ‌ల్ క‌థాంశాన్ని ఎంచుకుని `ఓ బేబి` చేశాను. ఇది కూడా వ‌ర్క‌వుట్ కాక‌పోతే ఏం చేయాలో నాకైతే తెలీదు... అని స‌మంత తెలిపారు.

మిస్ గ్రానీ రీమేక్ చేశారు కదా?  ఛాలెంజింగ్ అనిపించిందా? అన్న ప్ర‌శ్న‌కు.. ``ప్ర‌తి సినిమా ఒక ఛాలెంజ్. క్లాసిక్ సినిమా రీమేక్ ఇంకా పెద్ద ఛాలెంజ్`` అని అన్నారు. ఇప్ప‌టికి తెలుగు వెర్ష‌న్ తో క‌లిసి ఏడో రీమేక్ ఇది. మిస్ గ్రానీని అంత మంది రీమేక్ చేశారు. రీమేక్ అయినా.. ఓ బేబి కోసం కొరియ‌న్ వాళ్ల‌ను అన్ని విష‌యాలు క‌నుక్కుని చేశాం. 25 ఏళ్ల అమ్మాయిలా.. 75 ఏళ్ల ముస‌లావిడ‌లా న‌టించాలి. అలాగ‌ని ఎక్క‌డా ఓవ‌రాక్ష‌న్ లా అనిపించ‌కూడ‌దు. అదే ఈ మూవీలో ఛాలెంజింగ్ అనిపించింది... అని తెలిపారు. ఏదేమైనా ఈ ఇంట‌ర్వ్యూలో యూట‌ర్న్ ఫ్లాపైంద‌ని అంగీక‌రించిన స‌మంత .. కేవ‌లం త‌న వ‌ల్ల‌నే సినిమాల‌కు రార‌ని నిజాయితీగా అంగీక‌రించ‌డం ఆస‌క్తిక‌రం. త‌న గ‌ట్స్ ని మెచ్చుకుని తీరాలి.

    
    
    

Tags:    

Similar News