ఆ విషయంలో నేను పక్కాగా ఉంటాను - సమంత

Update: 2016-01-09 07:30 GMT
హీరోయిన్లు చిట్టి పొట్టి దుస్తుల్లో, సమయం సందర్భం లేకుండా తిరుగుతూ ఉంటారు. సినిమాల్లో పాత్రానుసారం ఎవరికైనా ఇది తప్పదనుకోండి. అయితే తెరవెనుక సమయపాలన విషయంలో ఏమాత్రం తగ్గేది లేదు అంటోంది చెన్నై బ్యూటీ సమంత.

కాలం అన్నది అందరికీ విలువైనదే. సినిమా విషయానికొస్తే నిర్మాతలు కోట్లు రూపాయలు పెట్టి సినిమాలు చేస్తారు. వారి ప్రతీ రూపాయికి విలువ ఇవ్వాల్సిందే. అందుకే సమయపాలన విషయంలో నేను పక్కాగా ఉంటాను అని చెప్పుకొచ్చింది సమంత. సెట్లో అడుగుపెట్టాక సెకను కూడా వృథా పోకూడదు. సినిమా లేకపోయినా షెడ్యూల్ ప్రకారమే నా పనులన్నీ ముగిస్తాను. పొద్దున్న లేచింది మొదలు తిరిగి బెడ్ ఎక్కేవరకు నా దినచర్య కాలానుగుణంగా సాగిపోతుందంటోన్న సమంత రోజుకి 24 గంటలు సరిపోవనుకునే వాళ్ళు ఉదయం తొందరగా లేవాల్సిందే అని సలహా కూడా ఇస్తోంది. ఇలా కాలంతో పోటీ పడుతుంది కనుకనే త్రివిక్రమ్ - మహేష్ లాంటి అగ్ర దర్శకులు, హీరోలతో సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా చలామణీ అవుతోంది.  
Tags:    

Similar News