సమంత సీక్రెట్స్ తెలిసిపోయాయ్

Update: 2016-11-10 05:30 GMT
ఫిట్నెస్ కి కేరాఫ్ అడ్రస్ సమంత.. అందానికి అసలైన నిర్వచనం సమంత.. ముద్దులొలికే అభినయానికి  ప్రతిరూపం సమంత. ఈ తరం హీరోయిన్స్ లో టాప్ ప్లేస్ సమంత.. ఇలా ఎన్ని రకాలగా చెప్పినా సమంత గురించి తక్కువే అవుతుంది. మరి ఇంతలా తన కీర్తి ప్రతిష్టలను పెంచుకోవడంలో సమంత అసలైన సీక్రెట్.. ఆమె రూపం. ఏళ్లు గడుస్తున్న కొద్దీ తనలోని అందాలను పెంచుకోవడమే తప్ప.. ఇసుమంతైనా తగ్గేందుకు శామ్స్ యాక్సెప్ట్ చేయదు.

ఇంతగా తన రూప లావణ్యాన్ని.. మేని మెరుపును కావడంలో సమంత సీక్రెట్ ఫిట్నెస్. రీసెంట్ గా 72కేజీల బరువును అవలీలగా ఎత్తుతున్న సమంత వీడియో ట్రెండింగ్ అయిపోయింది. ఇంతలేసి బరువులు ఎలా ఎత్తేస్తోందా అని అందరూ షాకైపోయారు. అయితే.. ఆమె కమిట్మెంట్ ఇందుకు కారణం అంటున్నాడు సమంత ఫిట్నెస్ ట్రైనర్ రాజేష్ రామస్వామి. స్ట్రెంగ్త్ పెరిగేలా... ఫ్యాట్ కంట్రోల్ చేసేలా వర్కవుట్స్ ను ఎంచుకుంటుంది ఈ చైన్న భామ. ఒకవేళ వర్కవుట్స్ కి టైమ్ లేకపోతే.. జాగింగ్ చేస్తుందట. ఏం చేసినా సరే.. ఇలా ఎక్సర్ సైజులు చేయడాన్ని ఎంజాయ్ చేస్తూ చేస్తుందట సమంత.

అందుకు అనుగుణంగానే రోజువారి లైఫ్ స్టైల్ కూడా ఉంటుదని తెలుస్తోంది. పైగా ఉపవాసాలు.. డైటింగ్ లాంటి వాటిపై శామ్స్ కు అసలు నమ్మకమే లేదు. చికెన్.. పచ్చళ్లు.. లాంటి వాటికి చాలామంది దూరంగా ఉంటారు కానీ.. ఈమె మాత్రం వాటిని కూడా ఫుల్లుగా లాగించేస్తుందట. నచ్చిన ప్రతీ ఐటెమ్ తినేసినా.. లిమిట్ గా తినడం.. అందుకు తగ్గట్లుగానే వర్కవుట్స్ చేయడంతోనే.. ఎన్నేళ్లు గడిచినా సమంత అలానే ఉంటోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News