సమంత ప్రధాన పాత్రలో సీనియర్ ప్రొడ్యూసర్ శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాణంలో తెరకెక్కిన సినిమా యశోద. హరి హరీష్ ఇద్దరు దర్శకులు డైరెక్ట్ చేసిన ఈ సినిమా మరో 3 రోజుల్లో అనగా నవంబర్ 11న థియేటర్ లలో సందడి చేయబోతుంది. సరోగసీ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న సినిమాలో సమంత ప్రెగ్నన్సీ లేడీగా కనిపించనున్నారు. యశోద సినిమా రిలీజ్ టైం లో సమంత మయోసైటిస్ తో బాధపడుతున్నారు. తనకు వచ్చిన ఈ వ్యాధి గురించి బయట పెట్టి ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ కి షాక్ ఇచ్చారు సమంత.
ఈ సినిమా షూటింగ్ టైం లోనే వ్యాధి లక్షణాలు ఉన్నా షూటింగ్ కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా తను ఇచ్చిన షెడ్యూల్స్ లో పాల్గొన్నాదట సమంత. ఇదే విషయాన్ని ఆ సినిమాలో హీరోగా నటించిన మళయాళ నటుడు ఉన్ని ముకుందన్ చెప్పారు.
సినిమా చేస్తున్న టైం లో కూడా సమంతకి ఈ వ్యాధి ఉందని తెలిసి కూడా ఏమాత్రం ఎనర్జీ డ్రాప్ అవకుండా షూటింగ్ చేశారని.. సినిమాలో ఆమెతో కలిసి నటించడం తన లక్కీ అని అంటున్నారు. సమంత లాంటి డెడికేటెడ్ యాక్ట్రెస్ తో పనిచేయడం చాలా బాగుందని అన్నారు.
సినిమా షూటింగ్ టైం లోనే తనకు వచ్చిన ఈ వ్యాధి గురించి తెలిసినా సరే షూటింగ్ కు ఎలాంటి అభ్యంతరం కలగకుండా చేశారని. ఆ విషయంలో సమంతకి హ్యాట్సాఫ్ చెప్పాలని అంటున్నారు ఉన్ని ముకుందన్. సమంతతో పనిచేయడం వల్ల చాలా విషయాలు తెలుసుకున్నానని.. ఆమె కో యాక్టర్స్ కి చాలా స్పేస్ ఇస్తారని.
ప్రతి విషయంలో సీన్ బాగా రావడానికి చాలా సపోర్ట్ చేస్తారని అంటున్నారు ఉన్ని ముకుందన్. సమంతతో పనిచేయడం ఒక గొప్ప ఎక్స్ పీరియన్స్ అంటున్నారు. సమంత అంతే ఎవరినైనా సరే ఇట్టే ఆకర్షించేలా చేస్తుంది.
యశోద సినిమాని ముందు చాలా తక్కువ బడ్జెట్ లోనే పూర్తి చేయాలని అనుకున్నా కథ డిమాండ్ చేయడం.. ప్రాజెక్ట్ లోకి సమంత లాంటి స్టార్ హీరోయిన్ రావడం వల్ల బడ్జెట్ లిమిటేషన్స్ పెట్టుకోలేదని అన్నారు. సినిమాని 3 కోట్లకు అటు ఇటుగా పూర్తి చేయాలని అనుకున్నా దాదాపు 40 కోట్ల దాకా ఖర్చు అయినట్టు చెప్పుకొచ్చారు సీనియర్ నిర్మాత కృష్ణ ప్రసాద్. సమంత మార్కెట్ కి ఈ రేంజ్ బడ్జెట్ అంటే రిస్క్ ఏమో కదా అని అంటున్న వారు ఉన్నారు. అయితే పాన్ ఇండియా రిలీజ్ అవుతున్న యశోద సినిమా బిజినెస్ బాగానే చేసిందని తెలుస్తుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.