అ..ఆ.. అంటే అందాల ఆరబోత కూడా

Update: 2016-05-30 09:30 GMT
అ..ఆ.. అంటూ మరో మూడు రోజుల్లో  ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది సమంత. ఈ చెన్నై సోయగం నటించగా.. ఈ సమ్మర్ లోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్న నాలుగో మూవీ ఇది. మొదట కోలీవుడ్ లో తెరి, ఆ తర్వాత ద్విభాషా చిత్రంగా 24, టాలీవుడ్ లో బ్రహ్మోత్సవం విడుదల కాగా.. జూన్ 2న అ..ఆ.. విడుదలవుతోంది.

ఇప్పటికే విడుదలైన వాటిలో చూస్తే.. తెరిలో అమ్మడి రోల్ గ్లామర్ డాళే కానీ.. తెలుగోళ్లకు ఆ సినిమా పెద్దగా ఎక్కలేదు. ఇక 24 - బ్రహ్మోత్సవం లో నార్మల్‌ లుక్‌ లోనే కనిపించిన సమంత.. అ..ఆ సినిమాలో కాస్త హాటుగానే ట్రై చేసినట్లు కనిపిస్తోంది. ఈ మూవీ పోస్టర్లను చూస్తుంటే.. సమంత అందాల డోస్ ప్రతీ ఫ్రేమ్ లోన ఉండేలా డైరెక్టర్ జాగ్రత్తలు తీసుకున్న విషయం అర్ధమవుతోంది. స్లీవ్ లెస్ డ్రస్సుల - లోనెక్ జాకెట్లు - క్లీవేజ్ కనిపించే గెటప్పులు.. ఇలా చెప్పుకుంటూ పోతే.. అక్షరాల సినిమాలో అందాల ఆరబోత బాగానే ఉంది.

అ..ఆ.. మూవీతో మలయాళీ సుందరి అనుపమా పరమేశ్వరన్ టాలీవుడ్ కి పరిచయం అవుతోంది. ఆ యంగ్ గ్లామర్ గాళ్ కి పోటీగా.. సమంత వేసిన గెటప్పులు ఆ పాపను డామినేట్ చేసేస్తున్నాయి కూడా. మొత్తానికి తన పక్కన ఎవరిని నుంచో పెట్టినా.. తనే హైలైట్ గా కనిపించేలా.. శామ్స్ బాగానే జాగ్రత్తలు తీసుకున్నట్లు కనిపిస్తోంది.
Tags:    

Similar News