అలా నరికేస్తున్నావేంటి సమంతా??

Update: 2017-02-21 05:57 GMT
సౌత్ సోయగం సమంత ఆన్ లైన్ లో తెగ అప్ డేటెగా ఉంటుంది. ఆఖరికి ఆదివారాలు ఎలా ఎంజాయ్ చేసిందో కూడా ఫోటోలను పోస్ట్ చేసి.. అభిమానులకు తెలియచేస్తూ ఉంటుంది. మరోవైపు.. తన సినిమా సంగతులను కూడా ఇలాగే అప్ డేట్ చేస్తూ ఉంటుంది శామ్.

ఇప్పుడు సమంత పోస్ట్ చేసిన ఓ తమిళ మూవీకి చెందిన ఫోటో.. సెన్సేషన్ గా మారింది. నిద్రపోతున్న ఓ వ్యక్తి పీక నరికేయడానికి సిద్ధంగా ఉన్న సమంత ఈ ఫోటోలో మనకు కనిపిస్తుంది. చేతిలో ఉన్న పట్టాకత్తి చూస్తే గుండెలు ఆగిపోవాల్సిందే. పొరపాటున కానీ ఆ నిద్రపోతున్న పోతున్న వ్యక్తి కళ్లు తెరిచి చూస్తే.. కత్తి వేటు కంటే ముందే గుండె ఆగి చనిపోయేంత టెరిఫిక్ సీన్ ఇది. అలాగని ఇదేమీ హారర్ మూవీ అనుకోవాల్సిన పని లేదు. సమంత చెబుతున్న సంగతుల ప్రకారం.. ఇదో రొమాంటిక్ కామెడీ మాత్రమే.

మరి అంత పెద్ద కత్తితో పీకను టార్గెట్ చేయడంలో రొమాన్స్ ఏముంటుందో కానీ.. ఈ సీన్ భలే థ్రిల్లింగ్ గా ఉంటుందని చెబుతోంది సమంత. విజయ్ సేతుపతికి జోడీగా త్యాగరాజన్ కుమారరాజా దర్శకత్వంలో రూపొందుతున్న మూవీలోని సన్నివేశం ఇది. 'అనీతి కథైగళ్' అనే టైటిల్ ప్రచారంలో ఉన్నా.. ఇంకా ఈ విషయాన్ని అఫీషియల్ గా కన్ఫాం చేయలేదు. అన్నట్లు.. బ్రేక్ తీసుకున్న తర్వాత సమంత చేస్తున్న మొదటి సినిమా ఇదే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News