స‌మంత... దేవుడు... ఓ కోరిక‌

Update: 2016-10-03 05:22 GMT
నువ్వు నాకు న‌చ్చావ్ సినిమాలో వెంక‌టేష్‌ లా `దేవుడా... ఓ మంచి దేవుడా....` అంటూ తోట కూర పప్పు మొద‌లుకొని ఎన్నెన్నో కోరుకొంటుంటాం. ఒక కోరిక తీర‌గానే మ‌రో చిట్టా రెడీ అయిపోతుంటుంది. దేవుడు మాత్రం ఎన్ని కోరిక‌ల‌ని తీరుస్తాడు? అందుకే మ‌న శ్ర‌మ‌కి - మ‌న ప్ర‌య‌త్నానికీ లింకు పెట్టి కోరిక‌లు తీరేలా చేస్తుంటాడు. అయితే హీరోయిన్ స‌మంత మాత్రం దేవుడిని ఎప్పుడూ పెద్ద పెద్ద కోరిక‌లు కోరుకోలేద‌ట‌. అవ‌కాశం - కార్లు - బంగ‌ళాలు.. ఇలాంటివాటి గురించి ఎప్పుడూ దేవుడి ముందు మొర పెట్టుకోలేద‌ట‌. ఒకే ఒక్క కోరిక కోరుతుంద‌ట‌. అది తీరుతున్నందుకు  సంతోషంగా ఉంద‌ని చెబుతోంది.

ఇంత‌కీ స‌మంత కోరుతున్న ఓ ఒక్క కోరిక ఏంట‌నేదేగా మీ సందేహం. ప‌రిస్థితుల్ని ఎదుర్కొనే స్థైర్యాన్ని ఇవ్వ‌మ‌ని.  జీవితాల్లో ప్ర‌తి ఒక్క‌రికీ ఓ  క్లిష్ట‌మైన స‌మ‌స్య వ‌స్తుంటుంది - ఆ  ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితుల్ని మ‌న‌కు మ‌నంగా ఎదుర్కొనే ధైర్యాన్నివ్వ‌మే స‌మంత కోరుతుంద‌ట‌. దేవుడు కూడా ఆమె మొర ఆల‌కిస్తుంటాడ‌ట‌. ``నిజంగా నేను డీల్ చేసే స‌మ‌స్య‌లే నాకు దేవుడు ఇస్తున్నాడు. ఆ లెక్క‌న నా కోరిక‌ని దేవుడు అనుగ్ర‌హించిన‌ట్టే క‌దా! ఇక‌పై కూడా నా కోరిక‌ల చిట్టాలో అది త‌ప్ప మ‌రోటి ఉండ‌దు`` అని చెప్పుకొచ్చింది స‌మంత‌.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News