రాకుమారిలా మారిపోయిన సమంత

Update: 2016-07-19 16:57 GMT
సౌత్ బ్యూటీ సమంత కెమేరా ముందుకొచ్చి ఓ నెల దాటిపోయింది. జనతా గ్యారేజ్ లో నటించిన తర్వాత మళ్లీ కెమేరా ముందుకు రాని సమంత.. ఇప్పుడు ఒక్కసారిగా రాకుమారిలా మారిపోయింది. రాజరికపు దుస్తుల్లో మెరిసిపోయింది.

చిట్టి పొట్టి డ్రస్సుల నుంచి అన్ని రకాల కాస్ట్యూమ్స్ కు శామ్స్ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయిపోతుంది. ఇప్పుడు రాచరికపు సాంప్రదాయ దుస్తుల్లో కూడా మిలమిలా మెరిసిపోతోంది. అయితే.. ఇదేమీ సినిమా షూటింగ్ కాదు.. సమంత చేస్తున్న కొత్త రోల్ అంతకంటే కాదు.  ప్రస్తుతం ఆషాఢ మాసం నడుస్తోంది. రానున్నది శ్రావణ మాసం కావడం.. అదంతా పెళ్లిళ్ల సీజన్ కావడంతో.. పలు షాపింగ్ మాల్స్, వస్త్ర దుకాణాలు, జ్యూయెలరీ మాల్స్.. కొత్త ప్రకటనలను సిద్ధం చేయడంలో బిజీ అయిపోయాయి.

అలా సమంత చేస్తున్న ఓ యాడ్ అండార్స్ మెంట్ కి సంబంధించిన ఫోటో షూట్ లోనిదే ఈ ఫోటో. అఫ్ కోర్స్.. ముఖాన బొట్టు లేకుండా కనిపిస్తున్న సమంతకు.. షూటింగ్ పూర్తయిపోయాక గ్రాఫిక్స్ లో ఆ బొట్టు పెట్టేసి సౌత్ ఇండియా సాంప్రదాయ నారిగా మార్చేసేస్తారని తెలుస్తోంది. అయినా సమంత లాంటి అందగత్తె బొట్టు పెట్టినా, పెట్టకున్నా అందానికి కేరాఫ్ అఢ్రస్ కదా.
Tags:    

Similar News