అక్కినేని - దగ్గుబాటి ఫ్యామిలీలను వేరు చేస్తున్న సమంత..?

Update: 2021-12-21 17:59 GMT
టాలీవుడ్ స్టార్ కపుల్ అక్కినేని నాగచైతన్య - సమంత జంట విడిపోతున్నట్లు ప్రకటించిన విషయం విధితమే. ప్రేమ వివాహం చేసుకున్న చై-సామ్.. తమ ఏడేళ్ల ప్రేమకు నాలుగేళ్ళ వివాహ బంధానికి స్వస్తి చెబుతూ అందరికీ షాక్ ఇచ్చారు. ఇకపై భార్యాభర్తలుగా ఉండబోమని.. వేర్వేరు మార్గాల్లో ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు.

చైతూతో విడాకుల ప్రకటన అనంతరం సమంత ఎక్కడ కూడా.. అక్కినేని ఫ్యామిలీ గురించి మాట్లాడ లేదు. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటున్నప్పటికీ.. అక్కినేని హీరోల సినిమా అప్డేట్ల మీద ఎలాంటి కామెంట్స్ చేయలేదు. 'లవ్ స్టోరీ' 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాలు సక్సెస్ అయినా సామ్ నుంచి రియాక్షన్ లేదు.

స్నేహితులుగా కొనసాగుతామని ప్రకటించినా.. ఇటీవల నాగచైతన్య పుట్టినరోజుకు శుభాకాంక్షలు తెలుపుతూ సమంత ఓ పోస్ట్ కూడా పెట్టలేదు. దీనికి తోడు సోషల్ మీడియాలో పలు రకాల కోట్స్ పోస్ట్ చేస్తూ.. పరోక్షంగా చైతూను టార్గెట్ చేస్తుందని నెటిజన్స్ కామెంట్స్ చేసేలా చేసింది. ఇదంతా చూస్తుంటే అక్కినేని ఫ్యామిలీకి సామ్ పూర్తిగా దూరం అవ్వాలని ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.

మరోవైపు నాగచైతన్య అమ్మమ్మ తరపు దగ్గుబాటి ఫ్యామిలీతో సమంత సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నట్లుగా అనిపిస్తోంది. ఎందుకంటే వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రిత పెట్టే పోస్టులకు సామ్ రియాక్ట్ అవుతుంటే.. ఆశ్రిత సైతం స్టార్ హీరోయిన్ పెట్టే ప్రతీ పోస్టును లైక్ చేస్తూ ఉంటుంది. దీనిని బట్టి వీరిద్దరూ టచ్ లోనే ఉన్నట్లు అర్థం అవుతుంది.

అలానే ఇటీవల రానా దగ్గుబాటి బర్త్ డే సందర్భంగా సమంత సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్ పెట్టి విషెస్ తెలిపింది. ఇదే క్రమంలో లేటెస్టుగా రానా భార్య మిహిక పుట్టినరోజుకు కూడా సామ్ ఇన్స్టాగ్రామ్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేసింది. ఇందులో 'హ్యాపీ బర్త్ డే మిహీక.. నువ్వు ఎక్కడుంటే అక్కడ నీకు మంచి జరగాలి' అని పేర్కొంది. ఇలాంటివి రానా మరియు ఆయన భార్యతో సమంత సాన్నిహిత్యాన్ని తెలియజేస్తున్నాయి.

సమంత వ్యవహార శైలిని బట్టి చూస్తే ఆమె అక్కినేని ఫ్యామిలీకి దూరంగా.. దగ్గుబాటి ఫ్యామిలీకి దగ్గరగా ఉంటుందని సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. అంతేకాదు నాగచైతన్య మేనమామ కుటుంబంతో క్లోజ్ గా ఉంటూ.. రెండు ఫ్యామిలీలను వేరు చేస్తోందని పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. భర్తతో విడిపోయినంత మాత్రాన.. దగ్గుబాటి కుటుంబ సభ్యులతో స్నేహ బంధాన్ని కొనసాగించడంలో తప్పేముందని సామ్ కు మద్దతుగా నిలిచేవారు లేకపోలేదు.

ఇకపోతే చై-సామ్ జంట విడిపోడానికి గల కారణాలను ఇప్పటి వరకు వెల్లడించలేదు. సమంత మాత్రం ఇటీవల విడాకుల ప్రస్తావన వచ్చినప్పుడు తాను కృంగి కృశించిపోయి చనిపోతానని అనుకున్నానని.. ఇంత బలంగా ఉంటారని అనుకోలేదని మీడియాకు తెలిపింది. ఇకపై దీనిపై మాట్లాడటం అనవసరమని అనుకుంటున్నట్లు చెప్పింది. మరోవైపు చైతన్య ఎప్పటిలాగే సైలెంట్ గా ఉంటూ వస్తున్నారు. విడాకుల గురించి ఎక్కడా కూడా ప్రత్యక్షంగా కానీ.. పరోక్షంగా కానీ స్పందించలేదు.

డివోర్స్ ప్రకటన తర్వాత సమంత - నాగచైతన్య వీలయినంత త్వరగా దీన్నుంచి బయటపడటానికి కెరీర్ మీద ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం 'బంగార్రాజు' 'థాంక్యూ' సినిమాలలో నటిస్తున్న చైతూ.. త్వరలో అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం చేయబోయే ఓ వెబ్ సిరీస్ తో డిజిటల్ వరల్డ్ లో అడుగుపెట్టనున్నారు.

మరోవైపు సామ్ ఇప్పటికే 'కాతువాకుల రెండు కాదల్' 'శాకుంతలం' సినిమాలను పూర్తి చేసి 'యశోద' అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ సెట్స్ మీదకు తీసికొచ్చింది. అలానే 'పుష్ప' లో ఐటమ్ సాంగ్ తో అలరించింది. త్వరలో 'అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్' అనే హాలీవుడ్ మూవీ షూటింగ్ లో పాల్గొననుంది.
Tags:    

Similar News