హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. ప్రతి చిన్న విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. నాగచైతన్య తో లవ్ కన్ ఫర్మ్ చేసినప్పటి నుంచి ఆమెకు సంబంధించిన ప్రతి విషయం తొందరగా వైరల్ అయిపోతోంది. నాగచైతన్యతో ఎంగేజ్ మెంట్ తర్వాత కూడా తమకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూనే ఉంటోంది. ఆమె ఏ టాపిక్ గురించి మాట్లాడితే దానికంత పబ్లిసిటీ వస్తోంది.
సమంత తాజాగా సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న రంగస్థలం 1985లో హీరోయిన్ గా నటిస్తోంది. అన్ని సినిమాల విశేషాల గురించి తెగ చెప్పే సమంత ఈ సినిమా గురించి మాత్రం ఇంతవరకు నోరిప్పలేదు. మెగాభిమానులంతా ఈ విషయంలో చాలా లోటు ఫీలవుతున్నారు. ఇప్పుడు ఆ లోటు కూడా తీరుస్తూ రంగస్థలం సినిమా గురించి ఓపెన్ గా తన ఒపీనియన్ షేర్ చేసింది. ఈ సినిమా తనకు స్పెషల్ గా నిలుస్తుందని చెప్పింది. పూర్తి విలేజ్ బ్యాక్ గ్రౌండ్ తో తెరకెక్కుతున్న రంగస్థలంలో సమంత కెరీర్ లోనే తొలిసారి పల్లెటూరి అమ్మాయి క్యారెక్టర్ చేస్తోంది. షూటింగ్ జరుగుతున్న ప్రాంతంలో గోదావరి ఒడ్డున కాళ్ల పట్టీలు వేసుకుని కూర్చున్న దృశ్యాన్ని షేర్ చేసింది. నేచురాలిటీ ఎప్పుడూ బాగుంటుందని తన ఒపీనియన్ ను యాడ్ చేసింది.
అక్టోబర్ లో నాగచైతన్యతో పెళ్లి పీటలు ఎక్కనుండటంతో సమంత షూటింగులు స్పీడప్ చేసింది. దర్శక నిర్మాతలు కూడా ఆమె పోర్షన్ వరకు గబగబా పూర్తి చేసేస్తున్నారు. లేకుంటే సమంత కాల్షీట్స్ కోసం మూడు, నాలుగు నెలలు వెయిట్ చేయాల్సిందే. అందుకే సినిమా కాస్తంత స్లోగా తీసే సుకుమార్ కూడా రంగస్థలం షూటింగ్ ఫాస్ట్ గా చేస్తున్నాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/