మరో తమిళ సినిమా సైన్ చేసిన సమంత??
ఆ మధ్యన తెలుగులో సంతకం పెట్టడానికి అసలు ఒక్కటంటే ఒక్క మంచి కథా లేదా క్యారక్టర్ అనేవే రావట్లేదని పబ్లిక్ గానే చెప్పేసిన సమంత.. ఇప్పుడు తనకు తృప్తినిచ్చే కథల కోసం తమిళంలోనే వెతుక్కుంటోంది. ఫిలిం నగర్లో వినిపిస్తున్న టాక్ ఏంటంటే.. ఆమె అక్కడే మరో సినిమాకూడా సైన్ చేసిందట.
మొన్నామధ్యన హీరో శివకార్తికేయన్ తదుపరి సినిమాను అమ్మడు సైన్ చేసిన విషయం తెలిసిందే. తమిళంలో వచ్చిన కరెంట్ తీగ సినిమాను తీశాడే.. ఆ దర్శకుడు ఇప్పుడు శివ అండ్ సమంత జంటగా ఈ సినిమాను తీస్తున్నాడు. . అయితే ఇప్పుడు విశాల్ హీరోగా రూపొందుతున్న మరో సినిమా 'ఇరుంబుతిరై' కథ కూడా చాలా కత్తిలా ఉండటమే కాదు.. సినిమాలో హీరోయిన్ పాత్రను దర్శకుడు పి.ఎస్.మిత్రన్ చాలా వెరైటీగా తీర్చిదిద్దాడట. అందుకే సమంత ఆ సినిమాను కూడా సైన్ చేసేసిందనే కోలీవుడ్ కారిడార్లో గాసిప్పులు వస్తున్నాయ్.
తెలుగులో సరైన కథలు ఉన్న సినిమాలు రావట్లేదు అంటూ డైరక్టుగా తన ట్విట్టర్లో పేర్కొన్న సమంత.. ''జనతా గ్యారేజ్'' వంటి హిట్టుకొట్టాక కూడా తెలుగులో ఒక్క సినిమాను సైన్ చేయలేదు. చూస్తుంటే గ్లామర్ పాత్రలను పక్కనెట్టేసి ఇక మీదట అన్నీ ఆర్టు సినిమాలనే చేసేలా ఉందే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/