తమిళ్ షూటింగులు మొదలుపెట్టింది

Update: 2017-07-07 09:51 GMT
సౌత్ బ్యూటీ సమంత.. ఇప్పుడు చకచకా సినిమా షూటింగులు చేసేస్తోంది. అక్టోబర్ 4న అక్కినేని నాగచైతన్యతో ఈమె వివాహం జరగనుండగా.. ఆలోపుగా వీలైనన్ని సినిమాలను పూర్తి చేసేయాలన్నది ఈమె ఆలోచన. పెళ్లికి ముందు వారాల నుంచి బ్రేక్ తీసుకోనున్న సమంత.. పెళ్లి తర్వాత కూడా ఐదారు వారాల పాటు షూటింగ్‌ లలో పాల్గొనే అవకాశం లేదు.

సుదీర్ఘమైన టూర్ లో భాగంగా.. దాదాపు నవంబర్ చివరి వరకూ షూటింగ్స్ చేయబోమని చైతు-సమంతల నుంచి ఇప్పటికే ఆయా మూవీ మేకర్స్ కు ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పటికే తెలుగులో రాజుగారి గది2 కంప్లీట్ చేసిన సమంత.. మరోవైపు రామ్ చరణ్ తో రంగస్థలం 1985ను కూడా చేస్తోంది. రీసెంట్ గా ఈ భామ శివకార్తికేయన్ తో కలిసి నటిస్తున్న సినిమా షూటింగ్ ప్రారంభించేసింది. పూర్తి స్థాయి ఎంటర్టెయినర్ గా రూపొందనున్న ఈ చిత్రంలో.. సమంత గెటప్ డిఫరెంట్ గా ఉండనుందని తెలుస్తోంది.

మరోవైపు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ మరుసటి చిత్రంలో కూడా సమంత నటిస్తోంది. దీంతో పాటు విశాల్.. ఆర్యలు ప్రధాన పాత్రలు పోషిస్తున్న సినిమాను కూడా సమంత చేయాల్సి ఉంది. వీటన్నిటిని పూర్తి చేసేందుకు. ఇంకా రెండున్నర నెలలు మాత్రమే సమయం ఉండడంతో.. అసలు గ్యాప్ తీసుకోకుండా షూటింగ్స్ చేసేస్తోంది  సమంత.


Tags:    

Similar News