సౌత్ సుందరి సమంతకు 2016 కీలకం కానుంది. ప్రారంభం ఆమెకు కలిసి రాకపోయినా.. ఈ ఏడాదంతా సమంతా హవా కనిపించడం ఖాయమే అని చెప్పచ్చు. గత వారం విడుదల అయిన కోలీవుడ్ మూవీ బెంగళూరు నాట్కాల్ నిరాశ పరిచింది. అలాగని శామ్స్ కి బ్యాడ్ టైం అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే.. కోలీవుడ్, టాలీవుడ్ లలో క్రేజీయెస్ట్ ప్రాజెక్టులు ఆమె చేతిలో ఉన్నాయి.
టాలీవుడ్ లో అయితే.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శక్వతంలో నితిన్ కలిసి నటిస్తున్న అ..ఆ.. చిత్రంతో సమంత తన భారీ ప్రయాణం ప్రారంభించనుంది. ఏప్రిల్ లో రిలీజ్ కానున్న ఈ మూవీపై అంచనాలు చాలానే ఉన్నాయి. ఆ తర్వాత మే నెలలో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన యాక్ట్ చేసిన బ్రహ్మోత్సవం మే నెల రెండు లేదా మూడో వారంలో విడుదల కానుంది. తెలుగు సినిమాల్లోనే హైయెస్ట్ బిజినెస్ జరుగుతున్న ఈ మూవీపై.. ఎక్స్ పెక్టేషన్స్ అంతకంతకూ పెరిగిపోతున్నాయి.
ఇక తమిళ్ లో అయితే విజయ్ సరసన తెరి - సూర్యతో 24 చిత్రాల్లో నటిస్తోంది సమంత. ఇవి కూడా సమ్మర్ లోనే విడుదల కానున్నాయి. అంటే ఈ సమ్మర్ లో విడుదలయ్యే భారీ సినిమాల్లో రెండు భాషల్లోనూ సమంత సందడే ఎక్కువగా కనిపించనుంది. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి కొరటాల శివ డైరెక్షన్ లో చేస్తున్న జనతా గ్యారేజ్ - ధనుష్ సరసన వాడా చెన్నై చిత్రాల్లో కూడా సమంత లీడ్ హీరోయిన్. ఈ చిత్రాల తర్వాత రెండు భాషల్లోనూ శామ్స్ టాప్ హీరోయిన్ అనిపించుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.