‘బిగ్ బాస్’ నుంచి షాకింగ్ ఎలిమినేషన్

Update: 2017-08-07 07:51 GMT
ఆరంభంలో మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకున్న తెలుగు ‘బిగ్ బాస్’ తర్వాత కుదురుకుని స్టడీగానే సాగిపోతోంది. ఇప్పడీ షో మూడో వారంలోకి అడుగుపెట్టేయడం విశేషం. ఈ వీకెండ్‌ కంటే ముందే ముగ్గురు షో నుంచి వెళ్లిపోగా.. ఇప్పుడు మరొకరు షో నుంచి ఔట్ అయిపోయారు. ఆ వ్యక్తి మరెవరో కాదు.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ సమీర్. తొలి రెండు వారాల్లో ఎలిమినేట్ అయిన వాళ్ల విషయంలో జనాలకు అంత ఆశ్చర్యమేమీ కలగలేదు. జ్యోతి అయినా.. మధుప్రియ అయినా జనాల నుంచి బాగానే వ్యతిరేకత ఎదుర్కొన్నారు. కాబట్టి వాళ్ల విషయంలో లైట్ తీసుకున్నారు. కానీ ఈ వారం సమీర్ ఎలిమినేట్ అవుతాడని జనాలు ఊహించలేదు.

సమీర్ మీద వ్యతిరేకత తక్కువని కాదు కానీ.. అతడితో పాటుగా ఎలిమినేషన్ కు షార్ట్ లిస్ట్ అయిన సింగర్ కల్పన మీద మాత్రం జనాల్లో చాలా వ్యతిరేకత ఉంది. సోషల్ మీడియాలో ఆమె పేరు కొట్టి చూస్తే అన్నీ నెగెటివ్ కామెంట్లే కనిపిస్తాయి. హౌస్ లో సైతం కల్పన మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. దీంతో కల్పన ఈ వారం ఔట్ అయిపోవడం ఖాయమని అనుకున్నారంతా. కానీ ఆశ్చర్యకరంగా సమీర్ హౌస్ నుంచి బయటికి వచ్చేశాడు. బిగ్ బాస్ వ్యూయర్స్ కు ఇది షాకే. సమీర్ కనీసం సగం రోజుల వరకైనా షోలో ఉండి తీరతాడని అనుకున్నారు. సమీర్ మీద కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ అతను హౌస్ లో మంచి ఎంటర్టైనర్ గా ఉంటున్నాడు. ఐతే ఇప్పటికే ఇద్దరు అమ్మాయిలు బయటికి వెళ్లిన నేపథ్యంలో మళ్లీ ఇంకో లేడీ అంటే బాగోదని.. సమతూకం ఉండదని భావించి సమీర్ ను బయటికి పంపించేశారేమో అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News