'వుహాన్'లో షూటింగ్ చేసిన ఫస్ట్ హీరో సంపూ..!

Update: 2020-05-09 08:30 GMT
సినీ ఇండస్ట్రీ పై కరోనా ప్రభావం రోజురోజుకి పెరుగుతోంది. ఇప్పటికే ఎన్నో సినిమాలు విడుదలకు సిద్దమై ఆగిపోయిన విషయం తెలిసిందే. నిజానికి ఈ కరోనా వైరస్ చైనా దేశంలోని వుహాన్ లో ఓ గబ్బిలాల మార్కెట్ లో పుట్టిందట. ఆ వైరస్ ప్రస్తుతం ప్రపంచదేశాలకు పాకి మనుషుల ప్రాణాలను బలి తీసుకుంటుంది. కానీ ఇంతవరకు ఈ వైరస్ కి మందు అందుబాటులోకి రాలేదు. కానీ ఈ కరోనా వైరస్ సినిమాలు నిలిచిపోవడమే కాదు.. దానిమీద సినిమా తీయడానికి కూడా కారణం అయింది. అవును ఇప్పుడు టాలీవుడ్ లో కరోనా వైరస్ పై సినిమా రాబోతుందని తెలుస్తుంది. ఆ సినిమాలో హీరో ఎవరో కాదు.. బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు.

మొదటి సినిమా 'హృదయ కాలేయం'తోనే ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన సంపూ.. ఆ తర్వాత వరుస పరాజయాలను ఖాతాలో వేసుకున్నాడు. అయితే చాలా విరామం తర్వాత ఇటీవలే కొబ్బరిమట్ట సినిమాతో ఓ మోస్తరు హిట్ అందుకున్నాడు. తన ప్రతీ సినిమాలో ఏదొక ప్రయోగం చేసే సంపూ ఈసారి ఏకంగా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ బ్యాక్ డ్రాప్ గా ఓ సినిమా చేస్తున్నాడు. ఈ రోజు సంపూ పుట్టినరోజు. ఈ సందర్బంగా ఆ చిత్రయూనిట్ సంపూ కొత్త సినిమా పోస్టర్లు విడుదల చేసింది. ఇంకా పేరు కూడా పెట్టని ఈ సినిమా ఓ మెడికల్ థ్రిల్లర్ గా రూపొందుతుందని సమాచారం. ఇక ఆ పోస్టర్లలో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. వుహాన్ గబ్బిలాల మార్కెట్ లో చిత్రీకరించిన చివరి సినిమా ఇదే.. అంటూ రాసారు.

ఇది చదివిన ప్రతీ ఒక్కరికి అసలు సంపూ టీమ్ వుహాన్ ఎప్పుడు వెళ్ళింది? ఇంకా గబ్బిలాల మార్కెట్లో షూటింగ్ ఎప్పుడు జరిపిందని.. ఆశ్చర్యానికి అనుమానాలకు గురవుతున్నారు. సంపూ ఈ పోస్టర్ లో డిఫరెంట్ స్టైల్, లుక్ లో కనిపిస్తున్నాడు. సంపూ చుట్టూ కరోనా వైరస్ స్ప్రెడ్ అయింది. ఇక ఈ సినిమాలో కరోనా వైరస్ తో సంపూ పోరాటం సాగిస్తాడని హింట్ ఇస్తున్నట్లు అర్ధమవుతుంది. హృదయ కాలేయంలో కంప్యూటర్ లాగా ఈ కరోనా కోసం ఏదైనా కనిపెడతాడేమో అని సినీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఏదైతేనేం సంపూ కొత్త సినిమా అనౌన్స్ చేయడం ఆనందమే.. ఇక ఈ సినిమా జులై 30న విడుదల కానుందట. చూడాలి మరి సంపూ అదృష్టం ఎలా ఉందో.. థియేటర్లు ఓపెన్ అవుతాయో లేదో.. హ్యాపీ బర్త్ డే.. బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు!
Tags:    

Similar News