రన్.. ఎందుకు పరిగెట్టలేదో?

Update: 2016-04-01 13:30 GMT
సందీప్ కిషన్ హీరోగా ఏకే ఎంటర్టెయిన్ మెంట్స్ రూపొందించిన మూవీ రన్. టీజర్ విడుదలైనప్పటి నుంచి ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. సేఫ్ ప్రాజెక్ట్ చేసేందుకు గాను కోలీవుడ్ మూవీ రన్ ను ఎంపిక చేసుకుని, బాగానే తెరకెక్కించారు. అయితే,  ఈ సినిమా రిజల్ట్ మాత్రం ఎవరూ ఊహించని రీతిలో వచ్చింది.

తొలి రోజునే మిక్సెడ్ టాక్ - రివ్యూలు వచ్చిన రన్ చిత్రానికి.. కనీస మాత్రం ఓపెనింగ్స్ కూడా దక్కలేదు. ఇక రెండో రోజు నుంచి కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. వీకెండ్ అడ్వాంటేజ్ కూడా ఏ మాత్రం లేదు. సందీప్ కిషన్ కి కానీ, ఏకే ఎంటర్టెయిన్ మెంట్స్ సంస్థ నుంచి వచ్చిన సినిమాలకు కానీ.. ఈ స్థాయి నిరాశ మిగిల్చిన చిత్రం ఇదొక్కటే. సాధారణంగా సినిమా ఏదన్నా డిజప్పాయింట్ చేస్తే కారణాలు అయినా తెలుస్తాయి.

కానీ రన్ విషయంలో మాత్రం ఎవరూ ఏం చెప్పలేకపోతున్నారు. ప్రీ రిలీజ్ పబ్లిసిటీల నుంచి ప్రతీ విషయంలోనూ హీరో సందీప్ కిషన్ చాలానే జాగ్రత్తలు తీసుకున్నాడు. అనేక సిటీల్లో తిరిగి స్వయంగా ప్రచారం చేశాడు. ఇంత చేసినా రిజల్ట్ ఇంత తేడా పడ్డానికి కారణం మాత్రం అర్ధం కావడం లేదట. ప్రాజెక్ట్ కూడా మరీ ఇంత ఫ్లాప్ అయ్యేంత బ్యాడ్ కంటెంట్ కాదు. అయినా సరే.. ఎందుకిలా జరిగిందో అర్ధం కావడం లేదని రన్ యూనిట్ అనుకుంటున్నారు.
Tags:    

Similar News