ఈ శుక్రవారం రిలీజవబోతున్న ‘అర్జున్ రెడ్డి’ గురించి కొన్ని రోజులుగా టాలీవుడ్లో ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. పలు వివాదాలతో ఈ సినిమా బాగానే వార్తల్లో నిలుస్తోంది. ఈ సినిమా నిడివి 3 గంటల 10 నిమిషాలన్న సమాచారం కూడా పెద్ద డిస్కషన్ కు దారి తీసింది. రెండున్నర గంటలంటేనే వామ్మో అంటున్న ఈ రోజుల్లో అంత నిడివి అనగానే జనాలు గుండెలు పట్టేసుకున్నారు. ఐతే బయట ప్రచారం జరుగుతున్నట్లుగా నిడివి 3 గంటల 10 నిమిషాలు కాదని.. 3 గంటల ఒక్క నిమిషమే అంటూ క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. అయినప్పటికీ అది కూడా ఎక్కువ లెంగ్త్ అనే భావిస్తున్నారు.
ఐతే నిజానికి ‘అర్జున్ రెడ్డి’ ఒరిజినల్ లెంగ్త్ 3 గంటల 40 నిమిషాలట. ఇదే నిడివితో సినిమాను రిలీజ్ చేయాలని కూడా సందీప్ దృఢ నిశ్చయంతో ఉన్నాడట. ఐతే ఈ చిత్రాన్ని కొనుగోలు చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్న ఏషియన్ మూవీస్ వాళ్లు అభ్యంతరం చెప్పారట. వేరే బయ్యర్లు కూడా నిడివి తగ్గించాల్సిందే అని ఒత్తిడి తెస్తే.. సందీప్ ఎడిటర్ తో కలిసి కూర్చుని అతి కష్టం మీద దాదాపు 40 నిమిషాల నిడివిని తగ్గించారట. ఈ విషయాన్ని సందీప్ రెడ్డే స్వయంగా వెల్లడించాడు. ఐతే 3 గంటల సినిమా అయినా ఏ ఇబ్బందీ ఉండదని.. ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టదని.. ఆద్యంతం సినిమాను ఆస్వాదిస్తూ అందులో లీనమైపోతారని.. నిడివి అన్నది సమస్యే కాదని ధీమాగా చెబుతున్నాడు దర్శకుడు. మరి అతడి కాన్ఫిడెన్స్ ఏమేరకు నిలుస్తుందో చూద్దాం.