సంఘవి.. ఇప్పుడైనా నమ్మొచ్చా బేబీ??

Update: 2016-02-03 06:02 GMT
ఈ మధ్యకాలంలో డ్యాన్స్‌ షో లలో జడ్జ్‌ గా ఎక్కువ పాపులర్‌ అయ్యింది పాత హీరోయిన్‌ సంఘవి. అప్పట్లో రావయ్య ముద్దుల మామ.. నీకు రాసిస్తా రాయలసీమ.. అంటూ అమ్మడు బాలయ్య పక్కన డ్యాన్స్‌ వేసినా.. మృగరాజులో మెగాస్టార్‌ చిరు ప్రక్కన మెరిసినా.. అమ్మడు హాట్‌ హాటుగా అదరగొట్టేసిది.

ఇకపోతే సినిమాల నుండి ఫేడవుట్‌అయ్యాక.. అనేకసార్లు ఈమెకు పెళ్లయిందంటూ రూమర్లు వచ్చాయి. 2012లో అమెరికాలో సెటిల్‌ అయిన ఒక కన్నడ డాక్టర్‌ ను పెళ్లి చేసుకుంటోందని న్యూస్‌ వచ్చింది. సంఘవి అసలు పేరు కావ్య రమేష్‌.. ఈమె బెంగుళూరులో పుట్టి పెరిగిన కన్నడ అమ్మాయి. ఇక 2013లో ఈమె పెళ్ళి జరిగిపోయిందంటూ మరోసారి వార్తలొచ్చాయి. కాని రెండు సార్లూ అవన్నీ రూమర్లే అంటూ కొట్టి పారేసింది అమ్మడు.

కట్‌ చేస్తే.. ఇప్పుడు మరోసారి సంఘవి పెళ్ళంటూ రూమర్లు వినిపిస్తున్నాయి. బెంగుళూరులోని ఒక ఐటి కంపెనీకి చెందిని సి.ఇ.ఓ ను ఈమె తాజ్‌ వివాంటా హోటల్‌ లో పెళ్ళాడేసింది అనేది రూమర్‌ సారాంశం. మరి ఈసారైనా పెళ్ళి కథ గాలి వార్తగా మిగిలిపోతుందా.. లేదా నిజంగానే నిజమవుతుందో చూడాలి.
Tags:    

Similar News