సోనూ సూద్ వెన‌క షాడో నాయ‌కుడు ఎవ‌రు?

Update: 2020-06-08 17:30 GMT
నటుడు సోను సూద్ వలస కార్మికుల కోసం చేసిన సేవ‌లు ప్ర‌స్తుతం హాట్ టాపిక్ గా మారాయి. మహమ్మారి లాక్ డౌన్ సమయంలో కార్మికులు వారి స్వ‌స్థ‌లాల‌కు వెళ్లేందుకు బ‌స్సుల్ని ఏర్పాటు చేసి చాలా చేశారు సోనూ సూద్. వలస వచ్చిన వారు ఇళ్లకు చేరుకోవడానికి టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ ‌ను అత‌డు అందుబాటులోకి తెచ్చారు. ప్రాక్టిక‌ల్ సాయంతో నిజమైన హీరో అయ్యాడు. అత‌డి సాయానికి అన్ని వైపుల నుంచి ప్ర‌శంస‌లు కురిసాయి. అయితే సోనూసూద్ ఇలా చేయ‌డానికి కార‌ణం ఇదీ అంటూ రంధ్రాన్వేష‌ణ చేసేవాళ్ల‌కు కొద‌వేమీ లేదు.

త్వ‌ర‌లోనే సోనూ రాజ‌కీయాల్లో ప్ర‌వేశిస్తున్నార‌ని.. త్వరలో ప్రధాని నరేంద్ర మోడీని కలుసుకుని ముంబైకి సెలబ్రిటీ మేనేజర్ అవుతాడ‌ని ప్ర‌చారం సాగుతోంది. వలస కార్మికులకు సహాయం చేయ‌డానికి కార‌ణం వేరు అంటూ శివసేన నాయకుడు సంజయ్ రౌత్ .. సోను సూద్ ని నిందించారు. అకస్మాత్తుగా సోను సూద్ అనే కొత్త `మహాత్మ` పుట్టుకొచ్చాడ‌ని ఇంత‌కుముందు ఎక్కడా కనిపించలేదని ఆయన అన్నారు. ల‌క్ష‌లాది వలస కూలీలను ఇతర రాష్ట్రాల నుంచి త‌మ ఇండ్ల‌కు పంపించేందుకు బ‌స్సులు ఏర్పాటు చేసాడు. దీంతో మహారాష్ట్ర గవర్నర్ `మహాత్మా సూద్` అంటూ ఆయన చేసిన కృషిని ప్రశంసించారు.

వ‌లస‌దారుల‌కు కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు చేయ‌ని సాయం చేశాడ‌ని సోనూ సూద్ పై ప్ర‌శంస‌లు కురిపించారు. అయితే అత‌డిపై సంజయ్ రౌత్ ప్ర‌శంస‌లు కురిపిస్తూనే సెటైర్లు వేసారు. ఈ మూడు నెలల్లో మనలో చాలామంది చేయలేనిది స‌ద‌రు న‌టుడు ఒంటరిగా చేయటం గొప్ప విషయం కాదంటారా? ``సోను సూద్ మంచి నటుడు. సినిమాలకు వేరే దర్శకుడు ఉన్నాడు. అత‌డు చేసిన తాజా ప‌ని బావుంది. కానీ దాని వెనుక రాజకీయ దర్శకుడు ఉండే అవకాశం ఉంది`` అన్నారు. లాక్ డౌన్ వేళ బ‌స్సుల్ని ఆయ‌న ఎక్క‌డినుంచి తెచ్చారు? అంటూ సంశ‌యం వ్య‌క్తం చేశారు.

వలస కార్మికులను పంపేయ‌డాకి రాష్ట్రాలను కేంద్రం అనుమతించనప్పుడు.. వారు ఎక్కడికి వెళుతున్నారు? అని ఆయన ప్రశ్నించారు. అయితే.. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ ని సోనూ సూద్ ఇంత‌కుముందు రాజ్ భవన్ వద్ద కలుసుకున్నారని సంజయ్ రౌత్ మరచిపోయి ఉండవచ్చు. నాయ‌కుల అండ‌తోనే సోనూసూద్ బ‌హిరంగంగానే ఈ సేవ‌లు చేశారు.
Tags:    

Similar News