కన్నడ సినిమా పరిశ్రమలో డ్రగ్స్ వ్యవహారంలో పలువురు అరెస్ట్ అయ్యారు. అందులో ఇద్దరు హీరోయిన్స్ కూడా ఉన్న విషయం తెల్సిందే. సంజన గర్లానీ మరియు రాగిణి ద్వివేదిలు ఇద్దరు కూడా డ్రగ్స్ కేసులో కీలక నింధితులుగా ఉన్న కారణంగా వారిని అరెస్ట్ చేయడం జరిగింది. సెప్టెంబర్ నెలలో అరెస్ట్ అయిన వీరిద్దరు బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కాని డ్రగ్స్ కేసు కీలకమైనది.. వీరు బయటకు వెళ్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందనే ఉద్దేశ్యంతో కోర్టు వీరికి బెయిల్ ఇవ్వడం లేదు. గత నెలలో సంజన అనారోగ్య సమస్యలు చెప్పి బెయిల్ కోసం కోర్టుకు వెళ్లింది. గత నెలలో సంజన బెయిల్ పిటీషన్ ను తిరష్కరించిన కోర్టు నేడు బెయిల్ ను మంజూరు చేసింది.
కర్ణాటక హై కోర్టు కండీషన్స్ తో కూడిన బెయిల్ ను సంజనకు ఇచ్చింది. కండీషన్స్ తో భాగంగా ప్రతి నెల కోర్టుకు రెండు సార్లు హాజరు అవ్వడంతో పాటు.. పోలీసులు డ్రగ్స్ కేసులో ఎప్పుడు పిలిచినా విచారణకు రావాల్సి ఉంది. సాక్ష్యులను ప్రభావితం చేసేలా ఎలాంటి చర్యలు చేసినా కూడా బెయిల్ రద్దు అవుతుందని హెచ్చరించడం జరిగింది. ఇద్దరు వ్యక్తుల పూచికత్తుతో పాటు రూ.3 లక్షల అమౌంట్ ను కూడా బాండ్ గా సమర్పించాలంటూ కోర్టు ఆదేశించింది. నేడు సాయంత్రంకు ఆమెను విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఆలస్యం అయితే మళ్లీ ఆమె విడుదల ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఆమె అనారోగ్య సమస్యల కారణంగా వెంటనే ఆమెను విడుదల చేసి ఆసుపత్రికి తరలించాలంటూ కోర్టు ఆదేశించింది.